Cancelled Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 15 నుంచి విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు

విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు రైళ్లు జనవరి 15 నుంచి రద్దు అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దు చేయడంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు , పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇవే..

Cancelled Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 15 నుంచి విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
Indian Railways

Updated on: Jan 04, 2024 | 7:39 AM

విజయవాడ, జనవరి 4: విజయవాడ రైల్వే డివిజన్‌లోని పలు రైళ్లు జనవరి 15 నుంచి రద్దు అయ్యాయి. మరికొన్ని పాక్షికంగా రద్దు చేయడంతో కొన్ని రైళ్లను దారి మళ్లించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల నిమిత్తం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పూర్తిగా రద్దు చేసిన రైళ్లు , పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు, దారి మళ్లించిన రైళ్ల వివరాలు ఇవే..

పూర్తిగా రద్దు చేసిన రైళ్లు ఇవే..

  • విజయవాడ–విశాఖపట్నం (22702/222701) ట్రైన్‌ సర్వీసులు జనవరి 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో రద్దు
  • గుంటూరు–విశాఖపట్నం (17239) ట్రైన్‌ సర్వీసులు జనవరి 19 నుంచి 28 వరకు రద్దు
  • విశాఖపట్నం–గుంటూరు (17240) ట్రైన్‌ సర్వీసులు జనవరి 20 నుంచి 29 వరకు రద్దు
  • బిట్రగుంట–విజయవాడ (07977/07978) ట్రైన్‌ సర్వీసులు జనవరి 19 నుంచి 28 వరకు రద్దు
  • బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238) ట్రైన్‌ సర్వీసులు జనవరి 22 నుంచి 26 వరకు రద్దు

పాక్షికంగా రద్దు చేసిన రైళ్ల వివరాలు

మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య జనవరి 15 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దారి మళ్లించిన రైళ్లు

  • జనవరి 15, 22 తేదీల్లో ఎర్నాకుళం–పాట్నా (22643) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 20, 29 తేదీల్లో భావ్‌నగర్‌–కాకినాడ టౌన్‌ (12756) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు గౌహతి (12509) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌–భువనేశ్వర్‌ (11019) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 15 నుంచి 28 వరకు ధనబాద్‌–అలెప్పి (13351)ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్‌ (18111) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 17, 24 తేదీల్లో జసిదిహ్‌–తాంబరం (12­376) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 15, 22 తేదీల్లో హథియా–ఎర్నాకుళం (22837) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 15, 24 తేదీల్లో హథియా–బెంగళూరు (18637) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 20, 27 తేదీలలో హథియా–బెంగళూరు (18637) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 16, 21, 23, 28 తేదీలలో హథియా–బెంగళూరు (12835) ట్రైన్‌ను దారి మళ్లించారు.
  • జనవరి 19, 26 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) ట్రైన్‌ను దారి మళ్లించారు.

ఈ రైళ్లన్నీ విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించినట్లు అధికారులు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.