India Post: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో పోస్టాఫీసు జాబ్స్.. అప్లై చేయండిలా.!

|

Feb 20, 2021 | 12:30 PM

India Post GDS Recruitment 2021: ఏపీ నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ అందించింది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు...

India Post: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10వ తరగతి అర్హతతో పోస్టాఫీసు జాబ్స్.. అప్లై చేయండిలా.!
Follow us on

India Post GDS Recruitment 2021: ఏపీ నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ అందించింది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఉండగా.. వాటి కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. తెలంగాణలో 1150 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్‌లో 2296 పోస్టులు ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ ఏపీలో కొనసాగుతోంది. ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇక ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయో నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు.

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు..

ఏపీలో మొత్తం పోస్టులు – 2296(జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947, ఓబీసీ- 507, ఈడబ్ల్యూఎస్- 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9, ఎస్సీ- 279, ఎస్టీ- 143)

దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 26

విద్యార్హత – 10వ తరగతి ఉత్తీర్ణత

అప్లికేషన్ ఫీజు – రూ. 100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, దివ్యాంగులకు నో ఫీజు

వయస్సు – 18 నుంచి 40 ఏళ్లు(2021 జనవరి 27 నాటికి)

ఎంపిక విధానం – మెరిట్ లిస్ట్ ఆధారం

వేతనం – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ – రూ. 12,000

–    అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ – రూ. 10,000

పూర్తి వివరాల కోసం – https://appost.in/