Kotipalli – Mukteswaram : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తోన్న కుండపోత వర్షాలకు తోడు మహారాష్ట్రలో పదిరోజులుగా పడుతోన్న వానలకు గోదావరికి వరద నీరు పోటెత్తుతోంది. ఫలితంగా గోదావరి పాయల్లో వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి – ముక్తేశ్వరం రేవు తాత్కాలిక రహదారి పూర్తిగా మునిగిపోయింది. దీంతో ముక్తేశ్వరం- కోటిపల్లి రేవుకు పంటు దాటేందుకు వేసిన తాత్కాలిక రహాదారి దెబ్బతింది. అటు, ప్రయాణికుల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణాలు చేసేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉంటే, వరద పాయల పరీవాహక ప్రాంతంలో జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదం అంచున జనం తిరుగుతున్నారు. దీనిపై అటు, అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలేవీ చేపట్టడంలేదు సరికదా అటువైపు చూసిన అధికారులే లేకపోయారు.
Godavari Overflow
కర్నూలు జిల్లా మహానంది మండలంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఫలితంగా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గాజులపల్లె – మహానంది మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Flood Water