Visakhapatnam: ఆటో-లారీ యాక్సిడెంట్‌తో ఉలిక్కిపడ్డ వైజాగ్‌.. అయినా మారని ఆటోల తీరు..!

| Edited By: Srilakshmi C

Nov 24, 2023 | 1:58 PM

ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళాలి. యూనిఫామ్ వేసుకుని పుస్తకాలు పట్టుకొని బయలుదేరాలి. కాస్త సమయం ఆలస్యమైతే స్కూల్లో గేట్లు మూసుకుపోతాయి. దీంతో హడావుడిగా వెళ్లాల్సిన పరిస్థితి..! ఈ నేపథ్యంలో కొంతమంది దగ్గరున్న పాఠశాలలకు టూవీలర్లపై, మరికొంత మంది నడుచుకుని వెళుతున్నారు. ఇంకొంతమంది బస్సులో బయలుదేరుతున్నారు. చాలామంది స్కూళ్లకు ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడే వస్తుంది అసలు సమస్య..! పరిమితికి మించి విద్యార్థులు.. వాటికి స్కూలు బ్యాగులు అదనం. కొన్ని ఆటోల్లో అయితే..

Visakhapatnam: ఆటో-లారీ యాక్సిడెంట్‌తో ఉలిక్కిపడ్డ వైజాగ్‌.. అయినా మారని ఆటోల తీరు..!
RTA Officials Undertaken Special Drive On School Autos
Follow us on

విశాఖ, నవంబర్ 24: ఉదయాన్నే స్కూల్ కి వెళ్ళాలి. యూనిఫామ్ వేసుకుని పుస్తకాలు పట్టుకొని బయలుదేరాలి. కాస్త సమయం ఆలస్యమైతే స్కూల్లో గేట్లు మూసుకుపోతాయి. దీంతో హడావుడిగా వెళ్లాల్సిన పరిస్థితి..! ఈ నేపథ్యంలో కొంతమంది దగ్గరున్న పాఠశాలలకు టూవీలర్లపై, మరికొంత మంది నడుచుకుని వెళుతున్నారు. ఇంకొంతమంది బస్సులో బయలుదేరుతున్నారు. చాలామంది స్కూళ్లకు ఆటోల్లోనే వెళ్లాల్సిన పరిస్థితి. అక్కడే వస్తుంది అసలు సమస్య..! పరిమితికి మించి విద్యార్థులు.. వాటికి స్కూలు బ్యాగులు అదనం. కొన్ని ఆటోల్లో అయితే డ్రైవర్ పక్కన కూడా విద్యార్థులను కూర్చోబెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు

ఆ ప్రమాదాలతో…

విశాఖలో ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు స్కూలు ఆటో ప్రమాదాలతో.. నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దృశ్యాలు చూసిన వారంతా గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ప్రాణపాయం ఏది సంభవించనప్పటికీ.. ఆ ప్రమాద తీవ్రత చూసి అందరూ భీతిల్లిపోయారు. చకచకా బడికి వెళ్లాల్సిన విద్యార్థులు ఇలా ఆటో ప్రమాదాల్లో చిక్కుకొని.. గాయాలతో నడిరోడ్డుపై ఆహాకారాలు చేస్తున్న ఘటనలు అందరినీ కలచివేశాయి.

..అయినా అదేతంతు!

పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్లడం.. డ్రైవర్లు కంట్రోల్ చేయలేక యాక్సిడెంట్లు గురై విద్యార్థులు గాయాల పాలనట్టు పోలీసులుగుర్తించారు. ఈ ప్రమాదాలతో అధికారులు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. అయినా.. కొంతమంది ఆటో డ్రైవర్లలో ఆ మార్పు కనిపించలేదు. స్కూలు ఆటోల మాట సరే సరి.. కాలేజీ విద్యార్థులను కూడా పరిమితికి మించి ఎక్కించుకొని వెళ్తున్న సందర్భాలు వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఎంత ఘోర ప్రమాదాలు జరిగినా కొంతమందిలో మార్పు రానట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

కనీస నిబంధనలు పాటించకుండా..

విశాఖలో స్కూల్ ఆటోలపై ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ ను విస్తృతం చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్ రాజారత్నం ఆధ్వర్యంలో మద్దిలపాలెంలో గాజువాక, ఎన్ఏడీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీవోలు ఆర్సిహెచ్ శ్రీనివాస్, రామ్ కుమార్ ల ఆధ్వర్యంలో వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా నిఘా పెంచారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తున్న ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్‌లు లేకుండా మరి కొంతమంది ఆటోలు నడుపుతున్నట్టు గుర్తించారు. ఎన్ఏడి ప్రాంతంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రుకుమునిషా, మధులపాలెంలో రాజారావు, మాధవి, గాజువాకలో హరిప్రసాద్ లలిత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృతంగా తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆటోలపై కేసులు నమోదు చేస్తున్నరు రవాణా శాఖ అధికారులు. ఒక్క రోజులోనే 35 వాహనాలపై కేసులో నమోదు చేసి.. 8 ఆటోలను సీజ్ చేశారు.

వాహనాలపై కేసులు.. పేరెంట్స్ కు కాల్స్..

విశాఖలో బుధవారం నాడు వేరే వేరే చోట్ల ప్రమాదానికి గురయ్యాయి రెండు స్కూలు ఆటోలు. ఓవర్ లోడింగ్ నిర్లక్ష్యం కారణంగా.. ఆటోలు కంట్రోల్ చేయలేక ప్రమాదాలకు కారణమయ్యాయి. భారీ ప్రమాదాలు జరిగినప్పటికీ కొంతమంది ఆటో డ్రైవర్లు, విద్యార్థుల పేరెంట్స్ లో కూడా మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. ఆర్టిఏ అధికారుల తనిఖీల్లో.. స్కూలు కాలేజీకి వెళ్తున్న విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. దీంతో విద్యార్థులను ఆటోలో నుంచి దింపి.. పేరెంట్స్ కు కాల్ చేసి కౌన్సిలింగ్ చేస్తున్నారు అధికారులు.

ఈ నెలలోనే 63 కేసులు..

స్కూలు కాలేజీలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలపై ఆర్టిఏ అధికారులు తనిఖీలు చేస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నవంబర్ 1 నుంచి 63 కేసులు నమోదు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఆటోల్లో విద్యార్థులను ఆరుగురికి మించి తీసుకెళ్లరాదని సూచిస్తున్నారు ఆర్టిఏ అధికారులు. గతం నుంచి అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. తాజా ప్రమాదం నేపథ్యంలో ఒక ప్రకటన జారీ చేశారు. ఆటోల్లో పరిమితికి మించి తీసుకెళ్లిన నిబంధనలో ఉల్లంఘించిన కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రాజారత్నం. స్కూలు కాలేజీలకు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు పర్మిట్లను కచ్చితంగా కలిగి ఉండాలని, ఫిట్నెస్, ఇన్సూరెన్స్తో పాటు కచ్చితంగా డ్రైవర్ కు లైసెన్స్ ఉండాలని సూచించారు. పేరెంట్స్ కూడా పిల్లలకు వాహనాల్లో పాఠశాలలకు పంపే ముందు ఆలోచించుకొని జాగ్రత్తలు తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. విద్యా సంస్థలకు విద్యార్థులను తరలించే వాహనాల వివరాలు కచ్చితంగా విద్యాసంస్థల యాజమాన్యాల దగ్గర ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.