రోడ్లపై నిల్చుంటారు. వచ్చే వాహనాదారులను ఆపుతారు. విరాళాలు ఇవ్వాలని కోరతారు. కాదంటే బెదిరింపులకు దిగుతారు. డబ్బులు ఇచ్చే దాకా అసభ్యకరంగా మాట్లాడతారు. ఇదంతా చేసేది అమ్మాయిలే.. అవే బెదిరింపులు.. విరాళాల పేరుతో ఆగడాలు. గతంలో గుజరాత్ అమ్మాయిలు.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ యవతులు. సేమ్ టూ సేమ్ స్కీంతో ఏపీలో రోడ్లపై హల్‌చల్ చేస్తూ వాహనదారులను ఇబ్బందిపెడుతున్నారు ఇతర రాష్ట్రాల అమ్మాయిలు. విరాళాల పేరుతో రోడ్లపై నిల్చోని… వాహనదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇచ్చినంత తీసుకోకుండా 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తీరా వారు అడిగినంత ఇవ్వకపోతే హిందీలో దుర్బాషలాడుతూ వాహనదారులను బెదిరిస్తున్నారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో జరిగింది. విరాళాల పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేస్తున్నారు ఈ అమ్మాయిలు.
రెండు మూడు రోజులుగా వీరి ఆగడాలకు చాలా మంది వాహనదారులు బలయ్యారు. ఈ ఘటన రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోని ధవళేశ్వరం, కడియంతో సహా పలు నిర్మానుష్య ప్రాంతాల్లో జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఈ అమ్మాయిలు వారు అడిగినంత ఇవ్వకపోతే బెదిరిస్తున్నారని.. హిందీలో తిడుతున్నారంటూ వాహనదారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో రంగంలోకి వీరి ఆటకట్టించారు పోలీసులు.
అయితే ఇలాంటి ఘటనలు గతంలోను ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో జరిగాయి. గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర హైవేపై గుజరాత్ కు చెందిన అమ్మాయిల ముఠా సేమ్ ఇలాగే వ్యవహారిస్తుంటే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. గతంలో గుజరాత్ అమ్మాయిలు ఇలాంటి ఘటనలకు పాల్పడితే.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన అమ్మాయి వంతైంది. అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి వీరికి ఏమైనా లింక్ లు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..