Andhra Pradesh: ఏపీలో సంక్రాంతి సందడి.. ఓ వైపు పండుగ.. మరోవైపు పొలిటికల్‌ లీగ్‌..

ఇక పండగ సందడిలో ఇటు టీడీపీ..అటు జనసేన టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు.. మంత్రి అంబటి రాంబాబు. అభిమానుల సమక్షంలో తాను డ్యాన్స్‌లు వేస్తే దాన్ని కూడా వివాదం చేశారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌లా తాను డబ్బులు తీసుకుని డ్యాన్స్‌లు వేయలేదన్నారు. తనను ఓడించడానికి ఎన్నికుట్రలు చేసినా.. జగనన్న ఆశీస్సులు ఉన్నంతవరకూ ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

Andhra Pradesh: ఏపీలో సంక్రాంతి సందడి.. ఓ వైపు పండుగ.. మరోవైపు పొలిటికల్‌ లీగ్‌..
Ap Politics
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 13, 2024 | 12:41 PM

ఏపీలో సంక్రాంతి సందడితో పాటు.. పొలిటికల్‌ సందడి కూడా ఊపందుకుంది. నేతలు పోటాపోటీగా సంబరాల్లో పాల్గొంటున్నారు. పనిలో పనిగా పొలిటికల్‌ కామెంట్స్‌ చేస్తూ..రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. సత్తెనపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మంత్రులు అంబటి రాంబాబు, రోజాతో పాటు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పాల్గొని సందడి చేశారు. కోడి పందాలు వేసి జనానికి వినోదాన్ని పంచారు. ముగ్గులను పరిశీలించి.. విజేతలకు బహుమతులు అందించారు.

ఇక పండగ సందడిలో ఇటు టీడీపీ..అటు జనసేన టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు.. మంత్రి అంబటి రాంబాబు. అభిమానుల సమక్షంలో తాను డ్యాన్స్‌లు వేస్తే దాన్ని కూడా వివాదం చేశారని మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌లా తాను డబ్బులు తీసుకుని డ్యాన్స్‌లు వేయలేదన్నారు. తనను ఓడించడానికి ఎన్నికుట్రలు చేసినా.. జగనన్న ఆశీస్సులు ఉన్నంతవరకూ ఎవరూ ఏమీ చేయలేరన్నారు. 2024లో జగనన్న వన్స్‌మోర్‌ అంటూ ప్రజలు మరోసారి దీవించాలని కోరారు..మంత్రి రోజా. పార్టీ నెలకొల్పడానికి ముందు నుంచి తాము జగన్‌ వెంట నడిచామన్నారు. రాజన్న రాజ్యం పోయింది అనుకున్న సమయంలో.. వైఎస్‌ జగన్‌ మళ్లీ రాష్ట్రంలో రైతురాజ్యం తెచ్చారన్నారు రోజా..

చంద్రబాబు, పవన్..

మరోవైపు సంక్రాంతిని తమదైన శైలిలో జరిపేందుకు సమాయత్తమయ్యాయి.. ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు. రేపు అమరావతిలో జరిగే భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్నారు.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులను..భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు నేతలు. ఈ కార్యక్రమంతో తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేయాలని డిసైడ్‌ అయ్యారు.

సంక్రాంతి తర్వాత జగన్..

ఇక సంక్రాంతి తర్వాత..మిషన్‌ 175పై మరింత దూకుడు పెంచాలని డిసైడ్‌ అయ్యారు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌. యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 25 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు జగన్‌. 26 జిల్లాల్లో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి.. లీడర్లు నుంచి కేడర్‌ దాకా అందరిని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు జగన్‌. ఈ మేరకు కేడర్‌తో భేటీ అవుతారు. దీనికోసం అధికార వైసీపీ రూట్‌ మ్యాప్‌ కూడా రెడీ చేసింది. కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసే ఈ భేటీలు ఉత్తరాంధ్ర నుంచి మొదలు కానున్నాయి. ఇక సంక్రాంతి తర్వాత నాలుగో లిస్ట్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు సమాయత్తమవుతున్నారు..వైసీపీ అధినేత.

బీజేపీ ఫోకస్..

సంక్రాంతి రాజకీయ సందడిలో బీజేపీ కూడా చేరింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ విశాఖకు వచ్చారు. తమ పార్టీ ఎంపీ GVL నరసింహారావు నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొంటారు. వాస్తవానికి పార్వతీపురం జిల్లాలో జరిగే- ప్రధానమంత్రి జంజత్‌ ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌లో నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. అయితే, సంక్రాంతి సంబరాల్లో ఆమె పొలిటికల్‌ పంచులు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో పొత్తులపై వర్కవుట్‌ చేస్తున్న బీజేపీ, ఒకవేళ పొత్తులు లేకుంటే ఒంటరిపోరుకు వెళ్లాలని కూడా కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌ విశాఖ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..