తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేస్తే సీఎం కావడం పక్కా – చింతా మోహన్
ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు చింతా మోహన్. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయమన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి బరిలోకి దిగాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు మేమే గెలిపించుకుంటాం అని చెప్పారు చింతా మోహన్.
రాజకీయాలు చిరంజీవి బ్రేక్ ఇచ్చి చాలా కాలం అయినా.. ఆయన సెంట్రిక్‌గా పొలిటికల్ కామెంట్స్ అయితే ఆగడం లేదు. తాజాగా చిరంజీవిపై ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం ఖాయమన్నారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు చింతా మోహన్. సీఎం పదవి కోరుకుంటున్న కాపులకు ఇదే సరైన సమయమన్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి బరిలోకి దిగాలన్నారు. చిరంజీవి నామినేషన్ వేస్తే చాలు మేమే గెలిపించుకుంటాం అని చెప్పారు చింతా మోహన్. చిరంజీవికి 50వేలకు పైగా మెజారిటీ వస్తుందన్నారు. 130 అసెంబ్లీ, 20 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పారు. కాకినాడ లోక్ సభ నుంచి సీతారాం ఏచూరి, నగరి అసెంబ్లీ నుంచి సీపీఐ నారాయణ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు చింతా మోహన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

