Andhra Pradesh: ఇదేందిరా సామీ.. పక్కవాడి వ్యాపారం నాశనం కావాలనే కోపంతో క్షుద్రపూజలు చేయించాడు

| Edited By: Aravind B

Aug 03, 2023 | 9:18 PM

సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ది చెందిన అక్కడక్కడ మూఢనమ్మకాలు ఇంకా జనంలో పాతుకుపోయాయి.. ఎవరిపైనన్నా కోపం ఉంటే తిట్టడమో, కొట్టడమో చేస్తారు. అయితే పక్కనున్న వ్యక్తి ఎదుగుతున్నారంటే ఓర్వలేని అసూయాపరులు కొత్తమార్గాలను ఎన్నుకుంటున్నారు. గ్రామాల్లో అప్పుడప్పుడు శత్రవులపై బాణామతి, చేతబడి పేరుతో క్షుద్రపూజలు చేసిన ఉదంతాలు ఉన్నాయి.

Andhra Pradesh: ఇదేందిరా సామీ.. పక్కవాడి వ్యాపారం నాశనం కావాలనే కోపంతో క్షుద్రపూజలు చేయించాడు
Black Magic
Follow us on

సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ది చెందిన అక్కడక్కడ మూఢనమ్మకాలు ఇంకా జనంలో పాతుకుపోయాయి.. ఎవరిపైనన్నా కోపం ఉంటే తిట్టడమో, కొట్టడమో చేస్తారు. అయితే పక్కనున్న వ్యక్తి ఎదుగుతున్నారంటే ఓర్వలేని అసూయాపరులు కొత్తమార్గాలను ఎన్నుకుంటున్నారు. గ్రామాల్లో అప్పుడప్పుడు శత్రవులపై బాణామతి, చేతబడి పేరుతో క్షుద్రపూజలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇలా చేస్తే శత్రువులకు ఏదైన కీడు జరుగుతుందని భావిస్తారు. దీనివల్ల వారు ఆర్థికంగా, మానసికంగా బలహీనమైపోతారనే ఆలోచనతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతారు. పాత కాలంలో ఇలాంటి వాటిని చేసేవారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు కూడా ఇలాంటి బాణమతి, చేతబడులు జరుగుతున్నాయి.అయితే వ్యాపారంలో ఎదుగుదలను చూసి ఓర్వలేక అతడు నాశనం కావాలని శపిస్తూ క్షుద్రపూజలు చేసిన ఓ ఉదంతం ప్రకాశంజిల్లాలో వెలుగు చూసింది. ఓ వ్యాపారి షాపు ఎదుట ఇలాగే క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా కూడా చేస్తారా అంటూ నివ్వెరపోతున్నారు.

ప్రకాశంజిల్లా గిద్దలూరు పట్టణంలోని మోడరన్ ఆటోమొబైల్స్ షాపు వద్ద ఈ క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆటోమొబైల్స్ దుకాణం వద్ద పసుపు, కుంకుమ నిమ్మకాయలు, పాత చెప్పులు వేసి పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా తన షాపు బాగా జరుగుతుందని, తాను నాశనం అయిపోవాలని ఇలా క్షుద్ర పూజలు చేశారని షాపు యజమాని కన్నీరు పెట్టుకున్నాడు. క్షుద్ర పూజల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు షాపు యజమాని తెలిపాడు. ఇదిలా ఉండగా ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి క్షద్రపూజలు, చేతబడులు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అది అంతా మూఢనమ్మకమైనప్పటికీ చాలామంది వాటికి ఇంకా భయపడుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలపై ప్రతిఒక్కరు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి ఆగడం లేదు. ఇంక వారిలో ఈ క్షుద్ర పూజల భయం నెలకొంది. ఇలా చేయడం వల్ల తమకు హాని కలుగుతుందని ఇంకా నమ్ముతూనే ఉన్నారు.