Andhra Pradesh: న్యూ ఇయర్ వేళ ఏపీలోని మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ప్రభుత్వం నుంచి అదిరే శుభవార్త

కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే కుటుంబసభ్యులు, తమ స్నేహితులతో జరుపుకునేందుకు ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో మందుబాబులకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త తెలిపాయి. పనివేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా..

Andhra Pradesh: న్యూ ఇయర్ వేళ ఏపీలోని మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్.. ప్రభుత్వం నుంచి అదిరే శుభవార్త
Wine Shops

Updated on: Dec 29, 2025 | 9:04 PM

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త అందించింది. మద్యం దుకాణాల పనివేళల్లో మార్పులు చేసింది. డిసెంబర్ 31, జనవరి 1న రాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను నడుపుకునేందుకు అనుమతి జారీ చేసింది.  ఈ రెండు రోజులు వైన్ షాపులతో పాటు బార్లు, ఇన్ హోస్ లైసెన్సులు, పర్మిట్ రూమ్ లైసెన్సనులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఇక ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే హోటళ్లకు కూడా అనుమతి ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆ రెండు రోజుల పాటు మాత్రమే అర్థరాత్రి 12 గంటల వరకు నడుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. మిగతా రోజుల్లో యథావిధిగా కార్యకలాపాలు ఉండనున్నాయి.

ప్రభుత్వం ఉత్తర్వులు

ఈ మేరకు  వైన్ షాపుల పనివేళలను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రన్సిపాల్ సెక్రటరీ పీయూష్ గోయల్ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. కేవలం న్యూ ఇయర్ వేడుకల సమయంలో పర్యాటకులు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించిన ప్రభుత్వం.. శాంతి భద్రతలను ఎలాంటి ఆటకం కలగకుండా నిర్వహించుకోవాలని ఆదేశించింది. లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది. రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చింది.

తెలంగాణలో కూడా 12 గంటల వరకు..

ఇటు తెలంగాణలో డిసెంబర్ 31న అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులకు అనుమతి ఇచ్చారు. రెస్టారెంట్స్, హోటల్స్‌, వైన్ షాపులకు అనుమతి ఇచ్చారు. బార్లు, క్లబ్స్, ఈవెంట్‌లకు అర్థరాత్రి 1 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మూడ్రోజలు క్రితం ఉత్తర్వులు విడుదల చేసింది.