Amma Vodi Scheme: ‘అమ్మఒడి’ పథకంలో మరో వెయ్యి కోత?.. హాజరు పర్సంటేజ్ అంత ఉంటేనే డబ్బులు?..
Amma Vodi Scheme: ప్రజల సంక్షేమమే ముఖ్యం అంటూ.. అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్.. ఓ కీలక పథకంలో
Amma Vodi Scheme: ప్రజల సంక్షేమమే ముఖ్యం అంటూ.. అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కార్.. ఓ కీలక పథకంలో కోత పెట్టేందుకు సిద్ధమైంది. ‘అమ్మఒడి’ పథకం కింద ఇస్తున్న రూ.15 వేలల్లో ప్రభుత్వం మరో వెయ్యి రూపాయలు కోత పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెయ్యి రూపాయలు కోత విధించిన సర్కార్.. ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు కోత విధించేందుకు సిద్ధమవడంతో మొత్తం రూ. 15 వేలలో రూ.2 వేలు కోత పడనుంది. వచ్చే నెలలో అంటే జూన్ నెలలో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ‘అమ్మఒడి’ పథకం కింద లబ్ధిదారులకు రూ.13 వేలు మాత్రమే అందించనున్నారు. అయితే, కోత విధించిన డబ్బును.. పాఠశాల విద్యాశాఖ ద్వారా స్కూళ్ల నిర్వహణకు కేటాయించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ పథకంలో మరో ట్విస్ట్ ఇచ్చారు అధికారులు. నవంబరు 8వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు విద్యార్థి హాజరు 75 శాతం ఉంటేనే అమ్మఒడి నగదు అందుతుందని తెలిపారు.