Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో వివాహేతర సంబంధం రచ్చకెక్కింది. ఇదే విషయంపై ఓ మహిళ, వ్యక్తి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి బాధిత మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన హోమియోపతి డాక్టర్ బాల కోటేశ్వరరావుతో, మహిళకు గత కొన్నేళ్లుగాకు వివాహేతర సంబంధం ఉంది. అయితే, కొంతకాలంగా సదరు వైద్యుడు ఆ మహిళను దూరం పెడుతూ వచ్చాడు. దాంతో అసలు మ్యాటర్ ఏంటా అని తెలుసుకునేందుకు ఆమె నేరుగా అతను పని చేసే ప్రాంతానికి వెళ్లింది.
అక్కడ డాక్టర్ బాల కోటేశ్వరరావును కలిసి ఆమె.. తనను దూరం పెడుతుండటంపై నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని బయటకు లాక్కొచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలో డాక్టర్ బాల కోటేశ్వరరావు, మహిళ పరస్పర దాడులు చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దారుణంగా కొట్టుకున్నారు. అనంతరం మహిళ జిల్లా ఎస్పీ విజయ రావును ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఎస్పీ వద్ద మొరపెట్టుకుంది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Also read:
Andhra Pradesh TDP: హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న టీడీపీ.. కారణం ఆయన వెనక్కి తగ్గటమే..!
Telangana: జిల్లాల కలెక్టర్లకు ఈ రూల్స్ వర్తించవా?.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు?..
IND vs ENG 4th Test: బ్యాడ్ లైట్ ఎఫెక్ట్.. మూడో రోజు నిలిచిపోయిన ఆట.. భారత్ స్కోర్ 270/3..