Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షం అలర్ట్.. ఓ వైపు చిటపట చినుకులు.. మరోవైపు భగభగ..!

దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర అంతరగత కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశల గాలులు వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్షం అలర్ట్.. ఓ వైపు చిటపట చినుకులు.. మరోవైపు భగభగ..!
Wether Report

Updated on: Jun 08, 2025 | 6:41 AM

హైదరాబాద్, జూన్‌ 8: ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు.. తెలుగు రాష్ట్రాల్లో చిత్ర విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర అంతరగత కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో తెలంగాణలో పశ్చిమ, వాయువ్య దిశల గాలులు వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక రాగాల రెండు రోజులలో స్వల్పంగా ఉష్ణోగ్రతలు పెరగున్నట్లు తెలిపింది. ఈ రోజు గరిష్టంగా ఖమ్మంలో 41, కనిష్టంగా మహబూబ్ నగర్‌లో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఏపీలో ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరన కేంద్రం తెలిపింది.

నేడు ఉక్కపోతతో పాటు గరిష్టంగా 40-41డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. శనివారం కావలిలో అత్యధికంగా 41.1, గన్నవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. నెల్లూరులో 40.8, బాపట్లలో 40.5, ఒంగోలులో 40.3 ఉష్ణోగ్రతలు నమోదైనాయి. కర్నూలులో 11మి.మీ, తిరుపతిలో 3, ఒంగోలులో 3, విజయవాడ, తునిలో 2, కాకినాడలో 1.మి.మీ చొప్పున వర్షపాతం నమోదు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.