Rain Alert: కూల్ కూల్ న్యూస్.. వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

|

Jul 10, 2024 | 1:04 PM

పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. షీర్ జోన్ లేదా  గాలుల కోత  సుమారుగా 20°N పొడవున , సగటు సముద్ర మట్టానికి  3.1 &5.8 కిమీల మధ్య  ఎత్తుతో దక్షిణం వైపు ఏటవాలుగా ఉంటుంది.

Rain Alert: కూల్ కూల్ న్యూస్.. వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Forecast
Follow us on

పశ్చిమ బంగాళాఖాతంలో దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. షీర్ జోన్ లేదా  గాలుల కోత  సుమారుగా 20°N పొడవున , సగటు సముద్ర మట్టానికి  3.1 &5.8 కిమీల మధ్య  ఎత్తుతో దక్షిణం వైపు ఏటవాలుగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి.  వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

రాబోవు  మూడు  రోజులకు వాతావరణ సూచనలు :

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్  & యానాం :-

బుధవారం, గురువారం, శుక్రవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా  ఆంధ్రప్రదేశ్:-

బుధవారం, గురువారం, శుక్రవారం: తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ:-

తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..