
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండగా.. కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతీ రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వాతావారణ శాఖ కీలక ప్రకటన చేసింది. 36 నుంచి 40 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 3 రోజులు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయో ఒకసారి చూడండి..
దిగువ ట్రోపోఆవరణములో ఆంధ్రప్రదేశ్ – యానాంలో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
శనివారం, ఆదివారం, సోమవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. గరిష్ట ఉష్ణోగ్గతలు సాధారణము కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. అని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..