AP TG Weather News : తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..!!

|

Sep 11, 2024 | 9:46 PM

వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే, ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో

AP TG Weather News : తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న మరో ముంపు..! కోస్తా, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..!!
IMD Weather Update
Follow us on

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉందా అంటే వాతావరణ శాఖ అవుననే అంటోంది. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై బలంగా ఉంది. దీని కారణంగా ఛత్తీస్‌గఢ్‌పైతో పాటుగా ఒడిస్సా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

ఇప్పటికే, ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..