Cyclone Alert: ముంచుకొస్తున్న తుఫాను.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ..

నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన వానలు తగ్గిన క్రమంలో వాతావరణ శాఖ తాజాగా మరో బాంబ్‌ పేల్చింది. ఈ రోజు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబర్‌ 27 నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

Cyclone Alert: ముంచుకొస్తున్న తుఫాను.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు! హెచ్చరికలు జారీ..
Cyclone In Andhra Pradesh

Updated on: Oct 24, 2025 | 7:07 AM

అమరావతి, అక్టోబర్‌ 24: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎట్టకేలకు పశ్చిమ వాయువ్యదిశలో కదిలి బలహీనపడిన తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్యదిశలో దక్షిణ కర్ణాటక మీదుగా కదిలి తూర్పు మధ్య, దాని సమీపంలోని ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోనికి అల్పపీడనం ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్రమట్టం నుండి 5.8 కి మీ ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుంది. ఇక నిన్న మొన్నటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన వానలు తగ్గిన క్రమంలో వాతావరణ శాఖ తాజాగా మరో బాంబ్‌ పేల్చింది. ఈ రోజు ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్టోబర్‌ 27 నుంచి మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ రోజు ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. తర్వాత వాయుగుండంగా బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు తెలిపింది. తుఫాను దక్షిణ కోస్తా లేదా తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మరో నాలుగైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే అక్టోబర్‌ 27 నుంచి 29 వరకూ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. శుక్రవారం (అక్టోబర్‌ 24) కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

నేటి తెలంగాణ వాతావరణం ఇలా..

బంగాళాఖాతంలో వరుస అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో తెలంగాణలోని మొత్తం 22 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇక రేపు యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. రేపటికి 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి ఉరుములతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో హైదరాబాద్ నగరమంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో ఉరుములు, గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us