మగ పామును చంపితే, ఆడ పాము దానికి పగ తీర్చుకుంటుందా?

Samatha

18 september 2026

Pic credit - Pinterest

పాములు అంటే ప్రతి ఒక్కరికీ విపరీతమైన భయం ఉంటుంది. అయితే చాలా మంది పాముల గురించి అనేక విషయాలు చెబుతూ ఉంటారు. అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

పాములు

ముఖ్యంగా పాములు పగబడతాయని చాలా మంది చెబుతుంటారు. ఇంకెంత మంది అయితే మగ పామును చంపితే, ఆడ పాము ఆ పగ తీర్చుకుంటుంది అటారు.

పాములు పగబట్టడం

కాగా, ఇది నిజమేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. పాములు పగబడతాయని మనం సినిమాలు, సీరియల్స్, జానపద కథలలో ఎక్కువగా వింటూ ఉంటాం.

నిపుణులు

చాలా వరకు పాములకు మనుషుల్లా, ప్రతీకారం తీర్చుకోలేవు అని చెబుతున్నారు నిపుణులు. వాటికి జ్ఞాపకశక్తి చాలా తక్కువగా ఉంటుంది, ఒక వ్యక్తి ముఖాన్ని గుర్తు పట్టి ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోలేవు.

ప్రతీకరం

కానీ చాలా మంది పాము చనిపోయినప్పుడు, అది ఒత్తిడికి గురి అవుతుంది. ఆ సమయంలో ఫెరోమోన్ అనే రసాయనం విడుదల చేస్తుందంట. దీని వలన ఇతర పాములు చనిపోయిన పాము వద్దకు చేరుకుంటాయంట.

ఒత్తిడి

ఈ రసాయనం ఇతర పాములను ఆకర్షించడం వల్లనే వేరే పాములు చనిపోయిన పాము చోటుకు చేరుకుంటాయి తప్ప మగ పాము చనిపోతే ఆడ పాము పగ తీర్చుకోవడం లాంటిది ఉండదంట.

పగ తీర్చుకోదు

చనిపోయిన పాము వదిలిన రసాయన సంకేతాలను ఇతర పాములు వాటి చీలిక నాలుకలను, జాకబ్సన్ అవకాయన్ని ఉపయోగించి, ఫెరోమోన్ల ప్రభావంతో ఆ చోటుకి చేరుకుంటాయట.

రసాయనం

కానీ పగ తీర్చుకోవడం అవాస్తవం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చనిపోతున్న పాము తనను చంపిన వాడి ముఖాన్ని తన కళ్లలో బంధించుకుంటుందని నిజం కాదని వారు తెలియజేస్తున్నారు.

పగ తీర్చుకోవడం