ఇది నిజమా? రాత్రి సమయంలో చెట్లు కూడా ముచ్చట్లు పెట్టుకుంటాయా?

Samatha

18 september 2026

Pic credit - Pinterest

ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి. అవి ఇప్పటికీ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా వింత అనుభూతిని ఇస్తుంటాయి.

ప్రకృతి

చాలా మంది అడవిలో చెట్లు కూడా ముచ్చట్లు పెట్టుకుంటాయని కొందరు అంటుంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, దీని పై చాలా మంది శాస్త్ర వేత్తలు పరిశోధనలు చేశారంట.

అడవి చెట్లు

అయితే అడవిలోని చెట్లు కూడా రాత్రి సమయంలో ముచ్చట్లు పెట్టుకుంటాయంట. కానీ అవి మనుషుల్లా మాట్లాడుకోవు కానీ సందేశాల ద్వారా తమ భావాలను తెలియజేస్తాయంట.

ముచ్చట పెట్టుకోవడం

చెట్లలోని వేర్లు భూమిలోపల ఒకదానికి మరొకటి అనుసంధానం చేయబడి ఉంటాయి. ఇలా అవి తమ సంకేతాలను ఒకరి నుంచి మరొకరికి పంపించుకుంటాయట.

వేర్లు

భూగర్భంలో ఉండే మైకోరైజల్ శిలీంద్రాలు చెట్లను అనుసంధానించే సహజమైన వలయాన్ని ఏర్పరుస్తాయంట. దీని వలన అవి కొన్ని సందేశాలను పంపుకుంటాయట.

మైకోరైజల్

ఒక చెట్టుపై కీటకాలు దాడి చేస్తే వెంటనే ఆ చెట్టు, ఇతర చెట్లకు హెచ్చరికలు జారీ చేస్తుందంట. మరి కొన్ని చెట్లు గాలిలోని ప్రత్యేక రసాయనాల ద్వారా మాట్లాడుకుంటాయంట.

కీటకాలు

అయితే నిపుణుల ప్రకారం, ఈ చెట్లలోని వేర్లు, శిలీంద్రాల వ్యవస్థ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుందంట.  అంతే కాకుండా అడవిలోని చిన్న, పెద్ద అన్ని మొక్కలకు నీరు, పోషకాలు అందించడంలో సహాయపడుతుందంట.

శిలీంధ్రాలు

అందువలన శాస్త్ర వేత్తలు ఈ సహజ నెట్ వర్క్‌ను హాస్యంగా వుడ్ వైడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. ఇది మాటలతో కాకుండా రసాయన, జీవ సంకేతాల మార్పిడితో జరిగే సంభాషణ.

 వుడ్ వైడ్ వెబ్