Andhra Pradesh: చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్‌ బస్సును ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా ఫ్యూజులు ఔట్!

|

Mar 25, 2022 | 9:13 AM

కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు.. గత కొద్దిరోజులుగా చాలా ఫేమస్ అవుతోంది. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా బంగారం, వెండి, నగదు...

Andhra Pradesh: చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్‌ బస్సును ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా ఫ్యూజులు ఔట్!
Andhra Pradesh
Follow us on

ఏపీవ్యాప్తంగా మద్యం, గంజాయి, డబ్బు, బంగారం, వెండి అక్రమ రవాణా పోలీసులు, సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల కాలంలో చెక్ పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఈ కోవలోనే కర్నూలు సరిహద్దులోని పంచలింగాల చెక్ పోస్టు.. గత కొద్దిరోజులుగా చాలా ఫేమస్ అవుతోంది. ఈ చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా బంగారం, వెండి, నగదు వరుసగా పట్టుబడుతుండటంతో అధికారులు ఇక్కడ మరింత విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తాజాగా మరోమారు ఇక్కడ సోదాలు జరిపిన సెబ్ అధికారులకు, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కళ్లు బైర్లు కమ్మేలా నగదు పట్టుబడింది.

హైదరాబాద్ నుండి రాజంపేటకు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేసిన సెబ్ అధికారులకు ఒక్కసారిగా షాక్‌ తిన్నంత పనైంది. బస్సులో ప్రయాణిస్తున్న రాజంపేటకి చెందిన ఉదయ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర బ్యాగులో సోదాలు చేయగా.. నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం రూ. 1.25 కోట్లను అధికారులు సీజ్‌ చేశారు. డబ్బుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ డబ్బును స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కాగా, అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సెబ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Viral Photos: కళ్లను మాయ చేసే చిత్రాలు.. నెట్టింట వైరల్.. చూస్తే షాకే!