విశాఖపట్నం జిల్లా పద్మనాభంలో దారుణం చోటుచేసుకుంది.. భార్యపై అనుమానంతో ఆమె ఊపిరి తీసాడు భర్త. ఆపై పొట్టపై కత్తితో పొడుచుకుని గాయపరచుకున్నాడు. భార్య తనపై కత్తితో దాడి చేసిందని నటించాడు. చివరకు పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా కొండా కరకం గ్రామానికి చెందిన భూలోక అనే వ్యక్తికి విశాఖపట్నం జిల్లా పద్మనాభం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భూలోక ట్రాక్టర్ డ్రైవర్. కొన్నాళ్లు సాపీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. భార్యపై అనుమానం పెంచుకున్నాడు భూలోక. గతడాది వెంకటలక్ష్మి తమ్ముడు కుమార్ కు వివాహం అయింది.. ఆ వివాహానికి వెళ్ళిన వెంకటలక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. మళ్లీ రాలేదు.. భర్త కూడా వెళ్లడంతో ఇద్దరూ అక్కడే ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువ అవ్వడంతో కొంతకాలం నుంచి భర్తకు దూరంగా ఉంటుంది భార్య.
ఈ క్రమంలోనే.. పద్మనాభంలోనే రాజ వీధిలో ఇల్లు అద్దెకి తీసుకొని పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. పెద్దల పంచాయితీ.. వారు ఇద్దరినీ మందలించడంతో ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అయినా భూలోకలో ఉన్న అనుమానం తగ్గలేదు. అనుమానం పెను భూతంగా మారింది.. ఈ క్రమంలోనే.. భూలోక.. భార్య వెంకటలక్ష్మి గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత.. తనకు తాను కత్తితో పొడుచుకొని.. భార్య తనపై హత్యాయత్నం చేసినట్టు నటించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భూలోకను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. విచారణలో భార్యను తానే చేసేనట్లు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. వెంకటలక్ష్మి మృతితో ఇద్దరు చిన్నారులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..