Andhra Pradesh: కన్నా.. ఇకపై నేను రాను.. బాగా చదువుకోండి.. కన్నబిడ్డలతో తండ్రి చివరి మాటలు..

భార్య,భర్తలమధ్య వివాదాలు అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాధలను చేశాయి. దంపతుల మధ్య గొడవలతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో 15 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. మనోవేదనకు గురై ఆ భర్త కన్నబిడ్డలను...

Andhra Pradesh: కన్నా.. ఇకపై నేను రాను.. బాగా చదువుకోండి.. కన్నబిడ్డలతో తండ్రి చివరి మాటలు..
Father Death

Updated on: Jan 03, 2023 | 11:22 AM

భార్య,భర్తలమధ్య వివాదాలు అభం శుభం తెలియని ఆ చిన్నారులను అనాధలను చేశాయి. దంపతుల మధ్య గొడవలతో విసిగిపోయిన భార్య క్షణికావేశంలో 15 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. మనోవేదనకు గురై ఆ భర్త కన్నబిడ్డలను ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించి తానూ తనువుచాలించాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు గ్రామంలో కలమడి ప్రసాద్‌బాబు, సుకన్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఐశ్వర్య, అక్షిత, అరవింద్‌, అవినాష్‌ లు సంతానం. దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో సుకన్య తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. అప్పటినుంచి ప్రసాద్‌బాబు మనోవేదనకు గురయ్యాడు. తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా పిల్లలను డిసెంబర్‌ 29న ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించాడు. తల్లి లేనందున తాను వారిని పోషించలేనని, మీరే చూసుకోవాలంటూ లేఖ రాసిచ్చాడు. వారు పోలీసుల సమక్షంలో బాలలను సంరక్షణలోకి తీసుకుని రాజంపేట బాలసదన్‌లో చేర్చారు.

కాగా.. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా తన బిడ్డలను చూసుకోడానికి ప్రసాద్‌బాబు వెళ్లాడు. కాసేపు వారితో హాయిగా గడిపాడు. ఆ సమయంలో ‘కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్‌ వాళ్లు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..’ అని చెప్పాడు. మర్నాడు జనవరి 2 ఉదయం రైల్వేకోడూరులోని రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలను అప్పగించే ముందురోజునుంచే తాను చనిపోతానని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ తమను ప్రసాద్‌బాబు కోరినట్లు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కౌన్సెలింగ్‌ ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..