Andhra Pradesh: ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?

| Edited By: Balaraju Goud

Dec 24, 2024 | 1:55 PM

ప్రియుడితో భార్య యవ్వారం నడుపుతుందని తెలిసిన ఓ భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మందలించిన భార్య బుద్ధి మారకపోవడంతో నీటి గుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకు ముందు తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra Pradesh: ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోకపోవడంతో భర్త ఏం చేశాడంటే..?
Chittoor Crime
Follow us on

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెనుమూరు మండలంలో భార్య మరో వ్యక్తిపై మనసు పారేసుకోవడం భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మరో వ్యక్తితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ దొరికిపోవడంతో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే భార్యపై అనుమానంతో నిలదీశాడు. చివరికి అవమాన భారంతో కుంగిపోయిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

పెనుమూరు మండలం గుంటుపల్లి లో జరిగిన ఈ ఘటన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గుంటుపల్లికి చెందిన 38 ఏళ్ల మోహనాచారి తన భార్యను సురేంద్ర అనే సచివాలయ ఉద్యోగి ట్రాప్ చేశాడని సెల్ఫీ వీడియోతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న భార్య ప్రేమాయణంపై మోహనాచారి నిలదీశాడు. దీంతో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ప్రియుడు సురేంద్రనే కావాలని తెగేసి చెప్పింది భార్య. ఇది జీర్ణించుకోలేక పోయిన మోహనా చారి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామం సమీపంలో ఉన్న క్వారీలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తలకు తగిలిన తీవ్ర గాయంతో అపస్మారక స్థితిలో ఉన్న మోహనాచారిని చికిత్స కోసం స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రి తరలించారు. తిరుపతిలో చికిత్స పొందుతూ మోహనచారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

అయితే మన మరణానికి సచివాలయ ఉద్యోగి సరేంద్ర కారణమంటూ సూసైడ్ నోట్ రాశాడు. అంతేకాదు, తన భార్యను, ట్రాప్ చేసిన సచివాలయ ఉద్యోగిని శిక్షించాలంటూ సీఎం, డిప్యూటీ సీఎం లకు విజ్ఞప్తి చేస్తూ సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు. ఆత్మహత్యకు సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..