AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త.. వచ్చి చూసేసరికి రక్తమడుగులో భార్య, ఇద్దరు పిల్లలు..!

కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. సామర్లకోట పరిధి సీతారామ కాలనీలో దారుణం జరిగింది. తల్లితోపాటు ఇద్దరు కుమార్తెలు హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు తలలు పగులగొట్టి హతమార్చారు.

Kakinada: నైట్ డ్యూటీకి వెళ్లిన భర్త.. వచ్చి చూసేసరికి రక్తమడుగులో భార్య, ఇద్దరు పిల్లలు..!
Kakinada Crime News
Balaraju Goud
|

Updated on: Aug 03, 2025 | 11:53 AM

Share

కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లిని అత్యంత పాశవికంగా హతమార్చారు దుండగులు. సామర్లకోట పరిధి సీతారామ కాలనీలో దారుణం జరిగింది. తల్లితోపాటు ఇద్దరు కుమార్తెలు హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై గుర్తు తెలియని వ్యక్తులు తలలు పగులగొట్టి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సీతారామకాలనీలో ప్రసాద్‌, మాధురి అనే దంపతులు.. వారి ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రసాద్ స్థానికంగా ఉన్న ఒక పరిశ్రమలో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత రాత్రి డ్యూటీ ఉందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం(ఆగస్టు 3) ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూసే సరికి భార్య, ఇద్దరు కుమార్తెలు రక్తపు మడుగులో పడి ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ముగ్గురి చంపి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతులను మాధురి (30), ఆమె బిడ్డలు పుష్పకుమారి (5), జెస్సిలోవ (5)గా గుర్తించారు. ముగ్గురి తలలపై బలంగా మోది హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ప్రసాద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. దోషులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా ఉండే సీతారామ కాలనీలో ఒకేసారిగా తల్లీకూతుళ్ల హత్య స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

వీడియో చూడండి.. 

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు!
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
రోహిత్ తొలగింపు వెనుక గౌతమ్ గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా ?
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
JEE Main 2026 మీ ఫైనల్ ప్రిపరేషన్‌ ఇలా ఉంటే.. టాప్ ర్యాంక్ మీదే!
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
ఉజ్జయినిలో భక్తి పారవశ్యంలో మునిగిపోయిన స్టార్ క్రికెటర్లు
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
హాఫ్ సెంచరీ చేసి 6 ఏళ్లు దాటిందిగా.. వరుస ఫ్లాప్ షోలతో భారంగా..
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
పంజాబ్ పీచమణిచిన సౌరాష్ట్ర సింహం..సెమీఫైనల్లో 165 పరుగులతో ఊచకోత
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
భారత్‌లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
అంతరిక్ష కేంద్రంలో అనారోగ్యం కలకలం.. భూమిపైకి వ్యోమగాములు
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి
గోల్డ్‌లోన్‌ ట్రై చేస్తున్నారా?ఫిబ్రవరి 1 వరకు వెయిట్‌ చేయండి