
అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా అంత్యక్రియలు సైతం జరిపించాడు. అన్ని పక్కగా ప్లాన్ చేసిన చివరికి ప్రియురాలితో హత్య గురించి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్ చివరికి ఇద్దరిని కటకటాల్లోకి నెట్టింది. కృష్ణా జిల్లా పెనమలూరులో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి భార్యభర్తలు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు నగేష్ లండన్‌లో చదువుకుంటుండగా.. కూతురు తేజశ్రీ హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తుంది. అయితే పోరంకిలో నివాసం ఉండే ఝాన్సీ అనే బ్యూటీషియన్ ప్రసాద్ ఇంటికి వచ్చి వెళ్తుండేది. అయితే బ్యూటీషియన్ జాన్సీతో పరిచయం కాస్త ప్రసాద్ చౌదరితో అక్రమ సంబంధానికి దారితీసింది.
ఈ విషయం గుర్తించిన రేణుకాదేవి తరచూ భర్తతో గొడవపడేది. దీంతో ఎలాగైనా రేణుకా దేవి అడ్డు తొలగించుకోవాలని ప్రసాద్ చౌదరి,ఝాన్సీ ఇద్దరు రేణుకా దేవిని హత్య చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో గతేడాది మే 18న రాత్రి రేణుకాదేవి ఆకస్మికంగా గుండె పోటుతో మృతి చెందింది. అయితే రేణుకాదేవి మృతిపై ఎవరికి అనుమానం రాకపోవడం, పైగా రేణుకాదేవి చనిపోయిన రోజు తల్లిదండ్రులు, అదే నివాసంలో ఉండడంతో రేణుకాదేవి గుండె పోటుతో చనిపోయిందని భావించారు. కానీ అనూహ్యంగా రేణుకదేవి మృతికి దాదాపు 9 నెలల తరువాత కారణం తెలిసి చివరికి కొడుకు పోలీసులను ఆశ్రయించాడు.
తల్లి రేణుకాదేవి చనిపోయిన తర్వాత లండన్ నుంచి ఇండియాకు వచ్చిన నాగేష్ తల్లి మృతి చెందిన బాధ తండ్రికి లేకపోవడం పైగా రోజురోజుకు ప్రవర్తనలో వస్తున్న మార్పును గమనించాడు. తండ్రి నిద్రిస్తున్న సమయంలో ఫోన్ తీసుకొని పరిశీలించి షాక్ అయ్యాడు. తన తల్లి మృతి సాధారణ మరణం కాదని గుండె పోటుతో చనిపోలేదని తెలిసి షాక్ అయ్యాడు. కన్న తండ్రి తన తల్లిని చంపి ఏమి తెలియనట్లు నటిస్తున్నట్లు గుర్తించాడు. అక్రమ సంబంధానీకి అడ్డొస్తుందని తల్లినీ ఎలా చంపాలన్న విషయంపై తండ్రి ప్రసాద్ చౌదరి, ప్రియురాలు ఝాన్సీల స్కెచ్ గురించి మాట్లాడి ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలించిన నాగేష్ పోలీసులను ఆశ్రయించాడు.
కొడుకు ఫిర్యాదుతో ప్రసాద్ చౌదరి, ప్రియురాలు జాన్సీని అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు అసలు నిజాన్ని రాబట్టారు. పోరంకిలో తమ నివాసంలో రేణుకా దేవికి నిద్ర మాత్రలు కలిపిన ఫుట్ జ్యూస్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాకా ముఖాన్ని దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్లు గుర్తించారు. దీంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. 9 నెలల తరువాత ఒకే ఒక్క ఫోన్ కాల్ రికార్డ్ చివరికి ఇద్దరిని పట్టించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..