పల్నాడు జిల్లా, నవంబర్ 23: భార్యాభర్తల మధ్య గొడవ.. ముగ్గురు హత్యలకు కారణమైంది. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య విభేదాల నేపథ్యంలో.. భార్య తరపు బంధువులు భర్త, అత్త మామలను నరికిచంపారు. పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ళ మండలం కోనంకిలో ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. కోనంకి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
భార్యాభర్తల మధ్య విబేధాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భార్య తరుపు బంధువులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపారు. మృతులను సాంబశివరావు (50), భార్య ఆదిలక్ష్మి (47), కుమారుడు నరేష్ (30)గా పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు నిర్దారించారు. హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పీఎస్‌లో సాంబశిరావు కోడలు మాధురి, నిందితులు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా.. ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..