Leopards: చిరుతల కోసం స్మగ్లర్ల వేట.. విశాఖ అడవుల్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్
ఏపీలో అడవుల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమా స్టైల్ లో స్మగ్లింగ్ చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసమో, జంతువుల చర్మం కోసమే డిమాండ్ ఉందనే ఆశతోనో కానీ.. స్మగ్లర్లు ఏకంగా చిరుతల కోసం వేట సాగిస్తున్నారు. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చిరుతలను వేటాడి చర్మాన్ని విక్రయిస్తున్న స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసింది.
ఏపీలో అడవుల్లో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమా స్టైల్ లో స్మగ్లింగ్ చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసమో, జంతువుల చర్మం కోసమే డిమాండ్ ఉందనే ఆశతోనో కానీ.. స్మగ్లర్లు ఏకంగా చిరుతల కోసం వేట సాగిస్తున్నారు. తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చిరుతలను వేటాడి చర్మాన్ని విక్రయిస్తున్న స్మగ్లర్ల ముఠాను అరెస్టు చేసింది. చిరుత (పాంథెరా పార్డస్) వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 షెడ్యూల్ -1 లో జాబితా చేయబడింది. జంతువును, దాని చర్మాన్ని కూడా కలిగి ఉండటం ఈ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.
మంగళవారం విశాఖలోని ఓ హోటల్ సమీపంలో ఈ ముఠాకు చెందిన ముగ్గురిని అధికారులు గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నిషేధించబడిన చిరుత చర్మాన్ని వారు కలిగి ఉన్నారని విచారణలో తేలింది. తదుపరి దర్యాప్తులో ఈ ముఠాకు చెందిన మరో హ్యాండ్లర్ ను గుర్తించారు. చిరుత చర్మాన్ని, ముఠా ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకుని నలుగురిని వెంటనే పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. చిరుత చర్మాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 నిబంధనల ప్రకారం తదుపరి దర్యాప్తు కోసం నలుగురితో పాటు వారి వాహనాలు (ఒక కారు మరియు ద్విచక్రవాహనం) కూడా లా ఎన్ఫోర్మెంట్ కు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ అనేక రకాల జీవవైవిధ్యానికి నిలయం, వివిధ రకాల వృక్ష, జంతుజాలాలను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల అభయారణ్యాలు రాష్ట్ర జీవవైవిధ్యాన్ని, సహజ వారసత్వాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఈ వన్యప్రాణి అభయారణ్యాలు అనేక జాతులకు స్వర్గధామంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని వన్యప్రాణి అభయారణ్యంలో కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం, రోళ్లపాడు వన్యప్రాణి అభయారణ్యం, వేంకటేశ్వర వన్యప్రాణి అభయారణ్యం, నాగార్జున సాగర్ – శ్రీశైలం అభయారణ్యం, కృష్ణా వన్యప్రాణి అభయారణ్యం, కౌండిన్య వన్యప్రాణి అభయారణ్యం మరియు గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం ఉన్నాయి. అయితే ఇవన్నీ రకరకాల జంతువులతో నిండి ఉన్నాయి. అందుకే స్మగ్లర్లు రెచ్చిపోతూ జంతువులను వేటాడుతున్నారు.