Siberian Birds: వీరాపురంలో గాలివాన బీభత్సం.. విడిదికి వచ్చిన వలస పక్షుల మృతి..

|

May 30, 2023 | 7:20 AM

సైబీరియన్ దేశం నుండి ప్రతి ఏటా వేసవికాలంలో వలస పక్షులు విడిదికి వస్తాయి. వేలాది కిలోమీటర్లు దాటి వివిధ రకాల పక్షులు ఇక్కడకు వచ్చి సేద తీరుతాయి. స్తానికుల మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సమయంలో పక్షులు కిలకిలా రావాలాతో చాలా సందడిగా ఉంటుంది.

Siberian Birds: వీరాపురంలో గాలివాన బీభత్సం.. విడిదికి వచ్చిన వలస పక్షుల మృతి..
Siberian Birds
Follow us on

శ్రీ సత్యసాయి జిల్లాలో అందమైన పర్యాటక ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేసవి కాలం రోహిణీ కార్తిలో రోకళ్ళు పగిలేలా ఎండలు మండించాల్సిన సమయంలో అకాల వర్షం కురుస్తూ జన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. చిలమత్తూరు మండలం వీరాపురంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలి వాన ధాటికి వందకు పైగా సైబీరియన్ పక్షుల మృతి చెందాయి.

సైబీరియన్ దేశం నుండి ప్రతి ఏటా వేసవికాలంలో వలస పక్షులు విడిదికి వస్తాయి. వేలాది కిలోమీటర్లు దాటి వివిధ రకాల పక్షులు ఇక్కడకు వచ్చి సేద తీరుతాయి. స్తానికుల మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ సమయంలో పక్షులు కిలకిలా రావాలాతో చాలా సందడిగా ఉంటుంది. అయితే ఇప్పుడు వీరాపురంలో విషాదం నెలకొంది. అకాల వర్షాలకు విడిదికి వచ్చిన వందలాది సైబీరియన్ పక్షులు మరణించాయి. పక్షుల కాపాడేందుకు వర్షాన్ని గాలిని లెక్కచేయకుండా గ్రామస్థులు చేసిన ప్రయత్నాలు ఏ విధంగా ఫలించలేదు. మరోవైపు గాలి వాన దాటికి  విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో గ్రామంలో అంధకారం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..