కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మత్స్యకారుల పంట పండింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు టన్నుల భారీ టేకు చేప జాలర్లకు చిక్కింది. వలలు తెగిపోతాయెమో అనే భయంతో మత్స్యకారులు ఆ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. దీని ధర వేలల్లో పలుకుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
సముద్ర జలాల్లో మత్స్య సంపదకు కొదువే లేదు. సముద్ర గర్భంలో మరింత లోతుకు వెళ్లేకొద్దీ భిన్న రకాల చేపలు భారీ సైజులో కనిపిస్తుంటాయి. తాజాగా తాజాగా మచిలీపట్నం వద్ద దిలకలదిండి పోర్టులో కొందరు మత్స్యకారులు వేటకు వెళ్లగా, ఏకంగా మూడు టన్నుల బరువున్న అరుదైన చేప లభ్యమైంది. వలలు తెగిపోతాయన్న కారణంతో ఈ చేపను ఎంతో జాగ్రత్తగా తీరం వరకు తీసుకొచ్చి, ఆపై క్రేన్ సాయంతో ఒడ్డుపైకి చేర్చారు. దీనిని టేకు చేప అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. దీని ధర వేలల్లో పలుకుతుందని చెబుతున్నారు.