Watch: రాత్రిపూట.. పొదల్లొంచి వింత శబ్ధాలు.. టార్చ్‌వేసి చూడగా..
సాధారణంగా వర్షా కాలంలో పాములు, విష పూరిత కీటకాలు ఎక్కువగా జనావాసాల్లో సంచరిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం తరచూ ఇవి జనావాసాల్లోకి చొరబడి వారిని భయాందోళనకు గురిచేస్తూ ఉంటాయి. తాజాగా మరోసారి అక్కడ దర్శనమిచ్చిన భారీ కొండచిలువ జనాను హడలెత్తించిది. ఇంతకు ఇదంతా ఎక్కడి జరిగిందనేగా మీ డౌట్.. తెలుసుకుందాం పదండి.

మొంథా తుఫాన్ ప్రభావంతో గత కొన్ని రోజుల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుసగా వర్షాలు కురిసాయి. దీంతో కొండచిలువలు, పాములు జనావాసాల మధ్య సంచరిస్తూ తరచూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన ఉమ్మడి జిల్లాలోని మహానంది మండలం తిమ్మాపురంలో వెలుగు చూసింది. గ్రామంలో ఓ భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన షేక్షావళి ఇంటి పెరట్లో భారీ కొండచిలువను కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వణికిపోయారు. వెంటనే స్నేక్ స్నాచర్ మోహన్‌కు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన స్నేక్ స్నాచర్ మోహన్‌కు ఆ భారీ కొండచిలువను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అది అతనికి చిక్కకుండా చాలా సేపు ముప్పతిప్పలు పెట్టింది. చివరకు అతనికి చిక్కపోయింది. అయినా కూడా మళ్లీ తప్పించుకునేందుకు అతనిపై దాడికి ప్రయత్నించింది.
కానీ స్నేక్ క్యాచర్ మాత్రం ఎంతో చాకచక్యంతో కొండచిలువను సంచిలో బంధించి దగ్గరలోని నల్లమల అడవిలో వదిలి వేశాడు. దీంతో గ్రామస్థులు, షేక్షావళి కుటుంబ సభ్యలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు ఇలాంటి కొండచిలువను చూడలేదని అన్నాడు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
