Chief Minister Jagan: పోలీసుల దిగ్బంధంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసం.. కారణమేంటంటే..?

|

Jan 22, 2021 | 12:57 PM

Chief Minister Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఆయన నివాసానికి వెళ్లే మార్గంలోనే..

Chief Minister Jagan: పోలీసుల దిగ్బంధంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నివాసం.. కారణమేంటంటే..?
Follow us on

Chief Minister Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే ఆయన నివాసానికి వెళ్లే మార్గంలోనే పోలీసుల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలుగు దేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం ఇంటికి వెళ్లే రహదారులన్నింటినీ మూసివేశారు. అన్ని దారుల వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేశారు.

ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి గానీ వదలడం లేదు. కొంచెం అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో తాడేపల్లిగూడెం వెళ్లే ఎంట్రెన్స్‌ల వద్ద హడావుడి నెలకొంది. కాగా, మాజీ మంత్రి టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్, తిరుపతి వేదికగా చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతి నిరాకరణ, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం వంటి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నేతలు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయిన పోలీసులు సీఎం నివాసం సహా, ఆయన నివాసానికి వెళ్లే మార్గాలన్నింటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Also read:

Mystery Disease: ఏదో కుట్ర జరుగుతోంది.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి ఆళ్ల నాని..

తెలంగాణలో నత్తనడకగా సాగుతున్న సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు.. పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌