Vijayawada Durgamma Temple: వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీ దేవీ అలంకారంలో దర్మనమిస్తున్నారు. సరస్వతీ దేవి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. వసంత పంచమి సరస్వతీ దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా, విద్యార్థులందరికీ దుర్గగుడి అధికారులు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం మహామండపంలో విద్యార్థినీ విద్యార్థులకు కలం, అమ్మవారి ఫోటో, రక్షాకంకణం, కుంకుమ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అధికారులు.
Also read:
TSPSC Notification: ‘స్టాఫ్ నర్స్’ మెరిట్ జాబితా విడుదల.. మీ ఫలితాల కోసం ఇలా చెక్ చేసుకోండి..