AP News: HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. జర్రుంటే అందరీ ప్రాణాలు గాల్లో కలిసేవి..!

కడప జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. లారీ గ్యాస్ లోడుతో ఉండడంతో గ్యాస్ లీకైతే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని స్థానికులు ఆందోళన చెందారు.

AP News: HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా.. జర్రుంటే అందరీ ప్రాణాలు గాల్లో కలిసేవి..!
Hp Gas Lorry Rolled Over

Updated on: Nov 03, 2024 | 8:11 AM

మనం రోజు రోడ్డు ప్రమాదాలు గూర్చి వింటూ ఉంటాం.. చూస్తుంటాం.. కొన్ని ప్రమాదాలు మనకు గుబులు పుట్టిస్తాయి. కొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. కొన్ని ఘటనలు మన కండ్ల ముందే జరిగితే ఒక్క క్షణం విస్తుపోతు ఉంటాం. తాజాగా అలాంటి ఘటననే ఒక్కటి జరిగింది. కడప జిల్లాలోని వేంపల్లి సమీపంలోని SNR కళ్యాణ మండపం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  HP గ్యాస్ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. అనంతపురం నుంచి లక్కిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. గ్యాస్ లీక్ అయితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని సమీపంలో నివాసం ఉంటున్న స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. దీంతో స్థానికుల ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన గూర్చి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీసీటీవీ వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి