AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటలపై మిడతల దాడిని ఇలా అడ్డుకోండి.. పొలాలు, ఇళ్ల నుంచి తరిమికొట్టే సూపర్ ట్రిక్స్‌..

నిమిషాల వ్యవధిలోనే ఎకరాల కొద్దీ పచ్చని పంటలను తుడిచిపెట్టేసే మిడతల దండు అన్నదాతల పాలిట పెను శాపంగా మారుతుంది. పొలాల్లో పంటలను నాశనం చేయడమే కాకుండా.. ఊళ్లపై, ఇళ్లపై కూడా విరుచుకుపడుతూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయితే ఈ మిడతల దాడి నుంచి పంటలను ఎలా రక్షించుకోవాలి? ఇళ్లలోకి రాకుండా వంటింటి చిట్కాలతోనే వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పంటలపై మిడతల దాడిని ఇలా అడ్డుకోండి.. పొలాలు, ఇళ్ల నుంచి తరిమికొట్టే సూపర్ ట్రిక్స్‌..
How To Get Rid Of Locusts
Krishna S
|

Updated on: Aug 29, 2026 | 11:59 AM

Share

పచ్చని పంటలపై వేల సంఖ్యలో విరుచుకుపడే మిడతల దండు రైతులకు తీరని నష్టాన్ని మిగులుస్తుంది. నిమిషాల వ్యవధిలోనే ఎకరాల కొద్దీ పంటను ఆరగించి సర్వనాశనం చేసే ఈ మిడతలు, కొన్నిసార్లు గ్రామాలు, నగరాల్లోని ఇళ్లలోకి కూడా చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. పొలాల్లో వీటిని అదుపు చేయడం, ఇళ్లలోకి రాకుండా అడ్డుకోవడం ఎలాగో అర్థంకాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. పంటలను రక్షించుకోవడంతో పాటు ఇంటి నుంచి మిడతలను ఎలా తరిమికొట్టాలనేది అందరూ తెలుసుకోవడం ముఖ్యం. మిడతలు సాధారణంగా సాయంత్రం వేళల్లో పంటలపై వాలి, రాత్రంతా అక్కడే ఉండి సూర్యోదయం తర్వాత వేరే ప్రాంతాలకు ఎగిరిపోతాయి. వీటిని పొలం నుంచి పారద్రోలేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతులు బాగా పనిచేస్తాయి.

పొలాల నుంచి మిడతలను తరిమే మార్గాలు

పెద్ద శబ్దాలు చేయడం: మిడతలు పెద్ద శబ్దాలకు భయపడతాయి. పొలాల వద్ద డ్రమ్ములు, పళ్లాలు, డబ్బాలు వాయించడం లేదా లౌడ్ స్పీకర్లు, డీజే సౌండ్స్ పెట్టడం ద్వారా అవి పంటలపై వాలకుండా పారిపోతాయి.

పొగ పెట్టడం: పొలం సరిహద్దుల్లో ఎండుగడ్డి, పిడకలతో పొగ వేయడం ద్వారా వచ్చే ఘాటైన పొగకు మిడతల దండు పొలంలోకి రాకుండా దారి మళ్లుతుంది.

రసాయన మందుల పిచికారీ

మిడతల దాడి తీవ్రంగా ఉన్నప్పుడు వ్యవసాయ నిపుణుల సలహాతో సరైన పురుగుమందులను పిచికారీ చేయాలి. మలాథియాన్, క్వినాల్ఫాస్, క్లోర్‌పైరిఫాస్ వంటి రసాయనాలను సిఫార్సు చేసిన మోతాదులో నీటితో కలిపి పిచికారీ చేయాలి. పురుగుమందులు చల్లేటప్పుడు రైతులు తప్పనిసరిగా ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇళ్లలోకి రాకుండా తరిమికొట్టే సహజ చిట్కాలు

ఇళ్లలో ప్రమాదకర రసాయనాలు వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల వంటింట్లో లభించే వస్తువులతోనే మిడతలను తరిమికొట్టవచ్చు.

వెల్లుల్లి స్ప్రే: వెల్లుల్లి రెబ్బలను నలిపి 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసి ఇంటి మూలల్లో, కిటికీల వద్ద చల్లాలి. వెల్లుల్లిలోని ఘాటైన వాసన మిడతలను దరిచేరనివ్వదు.

వేప నూనె మిశ్రమం: వేప నూనెను కొద్దిగా నీరు లేదా లిక్విడ్ సోప్‌తో కలిపి స్ప్రే చేయడం వల్ల ఆ చేదు వాసనకు మిడతలు తక్షణమే దూరంగా పారిపోతాయి.

ఎండుమిర్చి ద్రావణం: ఎర్ర మిరపకాయల పొడి లేదా కారాన్ని నీటిలో మరిగించి చల్లార్చిన ద్రావణాన్ని స్ప్రే చేస్తే ఆ ఘాటుకు మిడతలు ఇంట్లోకి రావు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మిడతలు లోపలికి రాకుండా తలుపులు, కిటికీలకు తప్పనిసరిగా జాలీలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాలు, గార్డెన్ ఏరియాను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ పద్ధతులను పాటిస్తే పంటలకు నష్టం వాటిల్లకుండా చూడటంతో పాటు మిడతల బెడద నుంచి శాశ్వత ఉపశమనం పొందవచ్చు.

Follow Us