Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పోలవరం పనులు ఇక పరుగులు పెట్టిస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వారం వారం ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తూ.. జెట్‌ స్పీడ్‌లో ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
Cm Chandrababu On Polavaram

Updated on: Dec 16, 2024 | 9:30 PM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం పనుల్లో వేగం పెంచింది. నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికలు రూపొందించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ట్రెండ్ మార్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు డెడ్‌లైన్లు పెరుగుతూ పోయాయి. కానీ చంద్రబాబు ప్రాజెక్ట్ డెడ్‌లైన్‌ కుదించారు. అక్టోబర్ 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచారు. టార్గెట్ 2026.. పోలవరం ప్రాజెక్టు గడువు కుదింపు.. బుల్లెట్‌ స్పీడ్‌తో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అన్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్‌ తో 7లక్షల 20వేల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. కొత్తగా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 2026 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. సోమవారం(డిసెంబర్ 16) పోలవరం ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించారు సీఎం చంద్రబాబు. పోలవరం గ్యాప్‌-1 పనులను పర్యవేక్షించారు. డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను పరిశీలించిన చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి