YSR Jagananna Colonies: : నేడు వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం.. ప్రారంభించనున్న సీఎం జగన్

|

Jun 03, 2021 | 9:14 AM

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయ‌స్ఆర్ – జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ఈ ఉదయం ప్రారంభిస్తారు..

YSR Jagananna Colonies:  : నేడు వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం..  ప్రారంభించనున్న సీఎం జగన్
Cm Jagan
Follow us on

YSR Jagananna colonies : ఆంధప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైయస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.. వైయ‌స్ఆర్ – జగనన్న కాలనీల్లో నూతన ఇళ్ల నిర్మాణ పనులను ఈ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ గా  ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 28 లక్షల 30 వేల మందికి పక్కాఇళ్లు నిర్మిస్తున్నారు. తొలి విడతగా ఇవాళ్టి నుంచి 15 లక్షల 60 వేల ఇళ్లను నిర్మిస్తారు. రూ.51 వేల కోట్ల వ్యయంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు. ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కాగా, అన్ని వసతులతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పేదల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, రాళ్లు, సిమెంటు, ఇటుకలు, విద్యుత్‌ సప్లై, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, నీటి వసతులను కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలు రచించి డీపీఆర్‌ లు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. ప్రతి లేఅవుట్‌ కు సంబంధించిన సమగ్ర వివరాలను సమకూర్చుకోవాలని.. ఇవాళ్టి నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి డిసెంబర్‌ నాటికి మొదటి దశ ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేయాలని అందుకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పన కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించారు.

జగనన్న కాలనీల్లో అంతర్గత రోడ్డు, కరెంటు, తాగునీరు అంగన్వాడీ కేంద్రాలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ తోపాటు అన్ని మౌలిక వసతులు కల్పించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించాలని అధికారులను ఆదేశించారు.

Read also : Service medals : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ పోలీస్ సిబ్బందికి సర్వోన్నత సేవా పతకాలు ప్రకటించిన కేసీఆర్ సర్కారు