అనంతపురం, జనవరి25; రోడ్డు వెంట వెళ్తుండగా ఎవరికైనా 100 రూపాయలు దొరికితే ఏం చేస్తారు.. హ్యాపీగా తీసుకుని జేబులో పెట్టేసుకుంటారు.. అంతే తప్ప ఇంకేం చేస్తారు.. అదే విలువైన బంగారం వంటిది దొరికితే.. దొరికిన వాళ్లు పండగా చేసుకుంటారు..ఇదే ప్రస్తుత కాలం.. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనకు రోడ్డుపై దొరికిన 3 తులాల బంగారాన్ని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..అనంతపురం జిల్లాలోని అనంతపురం పట్టణంలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది..ప్రస్తుతం ఈ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..
అనంతపురంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన రామచంద్రుడు గురువారం హౌసింగ్ బోర్డు స్టేట్ బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో కొంత డబ్బు జమ చేశాడు. అనంతరం స్థానిక డీ మార్ట్ సమీపంలోని వెంచర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. మూడు తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును సదరు ద్విచక్ర వాహనానికి తగిలించికెళ్లాడు. మార్గంమధ్యలో ఆ బ్యాగు ఎక్కడో కింద పడిపోయింది. అదేది గమనించకుండా రామచంద్రుడు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, అటుగా వెళ్తున్న పండ్ల వ్యాపారి మహమ్మద్ వలీకి ఆ బ్యాగు దొరికింది. సమీపంలో ఉన్న వారిని ఆరా తీశాడు. కానీ ఆ బ్యాగు ఎవరిదనేది తేలకపోవడంతో ఇంటికి తీసికెళ్లాడు. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏముందని పరిశీలించగా బంగారు చైన్, జత చెవి కమ్మలు ఉన్సట్లు గుర్తించాడు. దాంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.. ఆ బ్యాగులో ఉన్న బ్యాంకు పాసుబుక్ ఆధారంగా రామచంద్రుడికి సంబంధించినదని కనుగొన్నారు.
బంగారం ఉన్న బ్యాగులో రామచంద్రుడు బ్యాంకులో డబ్బు పాజిట్ చేసిన రసీదు… బ్యాంకు పాస్ బుక్ కూడా ఉండడంతో ఆ పాసుబుక్ ఆధారంగా అనంతపురం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లి బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న రామచంద్రుడిని పిలిపించాడు. అప్పటికే బంగారం బ్యాగ్ పోగొట్టుకున్న రామచంద్రుడు కంగారు పడుతున్న సమయంలోనే పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. మీ బంగారం దొరికింది అని… దీంతో రామచంద్రుడు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ పోలీసుల సమక్షంలో పండ్ల వ్యాపారి మహమ్మద్ వలీ మూడు తులాల బంగారాన్ని రామచంద్రుడికి ఇచ్చేశాడు. దాదాపు లక్షా 80 వేల రూపాయలు విలువ ఉన్న బంగారం పోయిన కొద్ది గంటల్లోనే దొరకడంతో అటు రామచంద్రుడు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
దీంతో రామచంద్రుడు మహమ్మద్ వలీ నిజాయితీని మెచ్చుకొని ఔదార్యంతో ఐదు వేల రూపాయలు బహుమానంగా అందించాడు. ఒక సాధారణ పండ్ల వ్యాపారి రోజుకు 1000 రూపాయలు వ్యాపారం చేసుకునే మహమ్మద్ వలీ మూడు తులాల బంగారం దొరికినా నిజాయితీగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి పోగొట్టుకున్న బాధితుడికి తిరిగి ఇవ్వడాన్ని పోలీసులు అభినందిస్తున్నారు..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..