Gannavaram High Tension: A1గా పట్టాభి, A2గా దొంతి చిన్నా.. నివురుగప్పిన నిప్పులా గన్నవరం..

నివురుగప్పిన నిప్పులా ఉంది గన్నవరం.! టీడీపీ ఆఫీస్‌పై వల్లభనేని వంశీ అనుచరుల దాడి సెగలు విజయవాడకూ పాకడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో పట్టాభితో పాటు పలువురిని అరెస్టు చేశారు.

Gannavaram High Tension: A1గా పట్టాభి, A2గా దొంతి చిన్నా.. నివురుగప్పిన నిప్పులా గన్నవరం..

Updated on: Feb 21, 2023 | 8:59 PM

గన్నవరంలో హైటెన్షన్. అటు వల్లభనేని వంశీ, ఇటు టీడీపీ వర్గీయుల ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో హైవోల్టేజ్ హీట్‌ కంటిన్యూ అవుతోంది. పోలీసుల విధులకు ఆటంకం కల్పించారంటూ CI కనకారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా FIR నమోదు చేశారు. హత్యాయత్నం, SC, ST అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. A1-పట్టాభి, A2గా దొంతి చిన్నాను చేర్చారు. మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అటు టీడీపీ ఆఫీస్‌పై దాడిని సుమోటోగా తీసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా 13 మందిని గుర్తించినట్లు తెలిపారు.

పట్టాభి ఇంటి దగ్గర రోజంతా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. పట్టాభి భార్య చందన పలుమార్లు గన్నవరం వెళ్లేందుకు ప్రయత్నించారు. బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొందరు ఇంటిపైకి ఎక్కారు. తన భర్తను పోలీసులు కొట్టారని ఆరోపించారు చందన.

బెజవాడ NTR సర్కిల్‌కు వెళ్లేందుకు టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన ప్రయత్నం కూడా టెన్షన్ క్రియేట్ చేసింది. ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. కర్రలతో సిద్ధమైన వెంకన్న టీమ్‌ను బయటకురాకుండా అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి

అటు టీడీపీ పిలుపునిచ్చిన ఛలోగన్నవరం కార్యక్రమాన్ని భగ్నం చేశారు పోలీసులు ముందుజాగ్రత్తగా పలువురు నేతల్ని హౌస్‌అరెస్ట్ చేశారు. బయటివాళ్లు గన్నవరానికి రాకుండా చర్యలు చేపట్టారు. మొత్తం 300 మంది పోలీసుల్ని మోహరించారు. 12 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. ప్రతి వెహికిల్‌ను తనిఖీ చేశారు. 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..