Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం!

నంద్యాల జిల్లా నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్)లోని ఆత్మకూరు అటవీ డివిజన్, నాగలూటి రేంజ్‌లో ఇటీవల పెద్దపులి మృతి చెందింది. టీ-66ఎఫ్ (T66F) ఆడ పెద్దపులి అనారోగ్యంతోనే చనిపోయిందని హైపవర్ కమిటీ తేల్చింది. దాదాపు 10 రోజుల క్రితం పులి మృతదేహం లభించగా, ఘటనపై నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను వెల్లడించింది.

Srisailam:పెద్దపులి ప్రాణాలు తీసింది ఎవరు..? హైపవర్ కమిటీ నివేదికలో వెల్లడైన అసలు నిజం!
Tiger Death Mystery

Edited By:

Updated on: Aug 07, 2026 | 10:39 AM

నంద్యాల జిల్లా నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్)లోని ఆత్మకూరు అటవీ డివిజన్, నాగలూటి రేంజ్‌లో ఇటీవల పెద్దపులి మృతి చెందింది. టీ-66ఎఫ్ (T66F) ఆడ పెద్దపులి అనారోగ్యంతోనే చనిపోయిందని హైపవర్ కమిటీ తేల్చింది. దాదాపు 10 రోజుల క్రితం పులి మృతదేహం లభించగా, ఘటనపై నిపుణుల కమిటీ సమగ్రంగా పరిశీలించి నివేదికను వెల్లడించింది.

పెద్దపులి సంరక్షణ నిపుణుల కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు కీలక విషయాలను వెల్లడించారు. ఆహార సేకరణలో భాగంగా పెద్దపులి ఒక ముళ్లపందిని వేటాడే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ముళ్లపంది ముళ్లు పులి శరీరంలో లోతుగా గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలు ఇన్‌ఫెక్షన్‌కు దారితీసింది. క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో పెద్దపులి మృతి చెందినట్లు కమిటీ నిర్ధారించింది. పోస్టుమార్టం పరీక్షల సమయంలో పులి శరీరంలో ముళ్లపంది ముళ్ల అవశేషాలను గుర్తించినట్లు కమిటీ వెల్లడించింది. అలాగే, ఘటనకు ముందు ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో కూడా పులి శరీరంలో ముళ్లు స్పష్టంగా కనిపించినట్లు పేర్కొంది.

టైగర్ రిజర్వ్‌లో పులుల సంరక్షణను ట్రాప్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని హైపవర్ కమిటీ తెలిపింది. అడవిలో పులుల ఆరోగ్యం, సంచారంపై నిరంతర నిఘా కొనసాగుతోందని, వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us