Nellore Court Theft: నెల్లూరు కోర్టు చోరీ కేసు మరో కీలక మలుపు.. దర్యాప్తులో లోపాలున్నాయన్న పీడీజే..

|

Apr 26, 2022 | 8:51 AM

నెల్లూరు కోర్టు చోరీ కేసు(Nellore Court Theft) మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేరింది. కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన..

Nellore Court Theft: నెల్లూరు కోర్టు చోరీ కేసు మరో కీలక మలుపు.. దర్యాప్తులో లోపాలున్నాయన్న పీడీజే..
High Court
Follow us on

నెల్లూరు కోర్టు చోరీ కేసు(Nellore Court Theft) మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు ఏపీ హైకోర్టుకు చేరింది. కేసు దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదన్న నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా.. సుమోటో పిల్‌గా పరిగణించింది హైకోర్ట్‌. బెంచ్‌ క్లర్క్‌ సహా 18 మందిపై ఇవాళ విచారణ చేపట్టనుంది. సీఎస్‌, డీజీపీ, జిల్లా జడ్జి, మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి సహా 18మందిని ప్రతివాదులుగా చేర్చారు. కోర్ట్‌ చోరీ కేసు దర్యాప్తులో లోపాలున్నాయని నివేదిక ఇచ్చారు పీడీజే. నిందితుల వేలిముద్రలు, పాదముద్రలను పోలీసులు సేకరించలేదని..డాగ్‌ స్క్వాడ్‌ను కూడా పిలిపించలేదని తెలిపారు నెల్లూరు పీడీజే. ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తేనే..వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నివేదిక ఇచ్చారు.

నెల్లూరు జిల్లా కోర్టు సముదాయంలో చోరీ ఘటన కలకలం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి పక్కాప్లాన్‌తో దొంగతనం జరిగినట్టు పోలీసులు తేల్చారు. కోర్టు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో నెల్లూరు చిన్న బజార్‌ పోలీసు స్టేషన్‌లో FIR నమోదు చేశారు. IPC సెక్షన్‌ 380, 457 కింద కేసు బుక్‌ చేశారు. ఈ రెండు సెక్షన్లు కూడా దొంగతనానికి సంబంధించినవే. నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోని 4వ అడిషనల్‌ కోర్టులో ఈ చోరి జరిగింది. చోరీ జరిగిన కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో సమీప ప్రాంతాల్లోని ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో చిందరవందరగా పడేసిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఓ కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్ల దొంగతనం జరిగినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా పోలీసుల గతంలో సీజ్‌ చేసిన ఒక ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌, 4 సెల్‌ఫోన్లు, నకిలీ పాస్‌పోర్టును దొంగలు ఎత్తుకెళ్లినట్టు కోర్టు సిబ్బంది గుర్తించారు. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాలతో పాటు కొన్ని పత్రాలను కోర్టు సిబ్బంది ఒక బ్యాగులో భద్రపరిచినట్టు తెలుస్తోంది. ఆ బ్యాగును చోరి చేసిన దొంగలు అందులో తమకు కావాల్సినవి తీసుకొని ఆ బ్యాగు, కొన్ని పత్రాలను కోర్టు పక్కన ఉన్న కాలువలో పడేసినట్టు గుర్తించారు. కోర్టు సిబ్బంది అవన్నీ బయటకు తీసి కోర్టు ప్రాంగణంలో ఆరబెట్టారు.

ఇదే కోర్టులో మాజీ వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, తాజా వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. సోమిరెడ్డి దాఖలు చేసిన కేసుపై విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆ కేసుకు సంబంధించిన పత్రాలు చోరికి గురవడం సంచలనంగా మారింది. చోరికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. తన కేసుకు సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు చోరి ఎలా జరిగిందో పోలీసుల నుంచి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్‌ మస్క్‌ చేతిలోకి ట్విట్టర్‌ పిట్ట.. 44 బిలియన్‌ డాలర్లకు డీల్‌..

Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..