AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్‌

|

Jan 19, 2021 | 4:23 PM

Ap Localbody Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు విచారణ ముగించింది. హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం....

AP Local Body Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్‌
Follow us on

Ap Localbody Elections: ఏపీ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ ముగించింది. హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌ వాదనలు వినిపించాయి.

ఈ కేసులో ఉపాధ్యాయులు, ఉద్యోగుల తరపున దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. సోమవారం రోజున వాదనలకు కొనసాగింపుగా మంగళవారం కూడా విచారణ చేపట్టింది హైకోర్టు కోర్టు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది బి. ఆదినారాయణరావు పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్రంలో కరోనా ఆంక్షల సడలింపు క్రమంగా పెరుగుతోందని, ఆంక్షల సడలింపులో ఐదో దశలో ఉన్నామని తెలిపారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే ఎవరి పనులు వారు చేసుకుంటున్నారని, రాష్ట్రంలో కరోనా వైరస్‌ క్రమంగా తగ్గుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అడ్డంకులు ఏమిటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఈసీ ప్రయత్నిస్తోంది తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండదని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: Deputy CMs on Roja: రోజా వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎంలు.. కుటుంబం అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు తప్పవన్న మంత్రి