Anantapur District: అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం.. ఆరుగురు అరెస్టు, 23 నాటు బాంబుల స్వాధీనం

Anantapur District: ఏపీలోని అనంతపురం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. ఓ ముఠా ఈ నాటు బాంబులతో ఇద్దరిని హతమార్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది...

Anantapur District: అనంతపురం జిల్లాలో నాటు బాంబుల కలకలం.. ఆరుగురు అరెస్టు, 23 నాటు బాంబుల స్వాధీనం
Follow us
Subhash Goud

|

Updated on: Jan 19, 2021 | 3:17 PM

Anantapur District: ఏపీలోని అనంతపురం జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. ఓ ముఠా ఈ నాటు బాంబులతో ఇద్దరిని హతమార్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 23 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, గత మూడు రోజుల కిందట కూడా జిల్లాలో నాటు బాంబులు కలకలం రేపాయి. రాప్తాడు నియోజకవర్గంలోని ఫ్యాక్షన్‌ ప్రభావిత మండలాల్లో ఒకటైన కనగానపల్లి మండలంలో కొందరు నాటుబాంబుల తయారీదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తాజాగా మరోసారి నాటు బాంబులు బయటపడటంతో తీవ్ర సంచలనంగా మారింది. ఎవరిని హత్య చేసేందుకు ఈ నాటుబాంబులను తయారు చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ నాటు బాంబుల వ్యవహారంలో పట్టుబడిన వారిని పోలీసులు విచారిస్తున్నారు.

Also Read:

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలో దారుణం.. ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట.. కారణం ఏంటంటే..