AP News: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. క్రిస్మస్‌కు భారీగా సెలవులు.. ఎప్పటినుంచంటే.?

|

Dec 23, 2024 | 12:42 PM

తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు సూపర్ గుడ్ న్యూస్. క్రిస్మస్ పండుగకు భారీగా సెలవులు లభించనున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రోజులు పబ్లిక్ హాలీడేలు ప్రకటించాయి.? ప్రైవేటు స్కూల్స్ ఎన్ని రోజులు ఇస్తాయి.? అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.?

AP News: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. క్రిస్మస్‌కు భారీగా సెలవులు.. ఎప్పటినుంచంటే.?
Students
Follow us on

క్రిస్మస్ పండుగ వచ్చేసింది. మళ్లీ విద్యార్ధులకు సెలవులు తెచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు ఈసారి భారీగానే క్రిస్మస్ సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. క్రిస్మస్ పండుగకు డిసెంబర్ 25, 26న పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. ఈ రెండు రోజులు అటు రాష్ట్రంలోని స్కూల్స్, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. ఇక 24న ఆప్షనల్ హాలీడే ఉండటంతో కొన్ని స్కూళ్లు ఆ రోజున కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీ‌లో డిసెంబర్ 25న మాత్రమే పబ్లిక్ హాలీడే కాగా.. డిసెంబర్ 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. కొన్ని ప్రైవేటు పాఠశాలలు, క్యాథలిక్ స్కూల్స్ విద్యార్ధులకు క్రిస్మస్ పండుగ అనుగుణంగా సెలవులను మరింత పొడిగించవచ్చు. ఈ సెలవులు డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 29 వరకు లేదా జనవరి 1 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా స్కూల్స్ విద్యార్ధుల తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2025 సంవత్సరం క్యాలెండర్‌లో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఆప్షనల్ సెలవులు ఉన్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్