Intelligence Agencies: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఆంధ్ర – ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. కారణం ఇదే

ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు నివురుగప్పిన నిప్పులా మారింది. ఒకవైపు పిఎల్‌జిఏ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిస్తే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షిస్తూ.. ఏవోబిలో నిఘా పెంచుతూ కూంబింగును ముమ్మరం చేశారు. దీనికోసం అదనపు బలగాలను రంగంలోకి దింపారు.

Intelligence Agencies: ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు.. కారణం ఇదే
Heavy Security Has Set Up In Andhra Odisha Border, Because Of Maoist Celebrations

Edited By:

Updated on: Dec 02, 2023 | 10:01 AM

ఆంధ్ర – ఒడిస్సా సరిహద్దు నివురుగప్పిన నిప్పులా మారింది. ఒకవైపు పిఎల్‌జిఏ వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిస్తే.. వాటిని అడ్డుకునేందుకు పోలీసులు వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షిస్తూ.. ఏవోబిలో నిఘా పెంచుతూ కూంబింగును ముమ్మరం చేశారు. దీనికోసం అదనపు బలగాలను రంగంలోకి దింపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు పోలీసుల నోటీసులు జరీ చేశారు. సమాచారం ఇవ్వకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు ఇచ్చారు.

మావోయిస్టు పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ వారోత్సవాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో..ఆంధ్ర – ఒడిస్సా బార్డర్‌లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఏజెన్సీని జల్లెడ పడుతున్నయి బలగాలు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఏజెన్సీలోని వారపు సంతల పై నిఘా పెట్టారు. జి మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, జీకే వీధి చింతపల్లి మండలాలతో పాటు ఏఓబి రోడ్లలో పటిష్ఠమైన నిఘా పెంచారు. మావోయిస్టు పార్టీ ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఇటీవల లేఖ విడుదలైన నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. ప్రధానంగా ఒడిస్సా వైపు నుంచి వచ్చే రోడ్లపై ప్రత్యేక నిఘా పెంచారు.

డాగ్ స్క్వాడ్ తో ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు..

ఏటా డిసెంబర్ 2 నుంచి 8 వరకు పి ఎల్ జి వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు మావోయుస్టులు. వారోత్సవాలు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పాడేరులో కలెక్టరేట్, ఐటీడీఏ కాంప్లెక్స్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. అనుమానితులపై ఆరా తీస్తున్నారు. ఒడిస్సా నుంచి వచ్చి పోయే వారిపై దృష్టి సారించారు. ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలపైన నిఘా పెట్టి లాడ్జిల్లో అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎవరైనా అనుమానస్పదంగా ఉంటే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. గతంలో కంటే మావోయిస్టుల కదలికలు ఏఓబిలో తగ్గినట్టు అనిపిస్తున్నప్పటికీ.. ఏ సమయంలోనైనా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా హెచ్చరికలు కూడా ఉన్నాయి. అందుకే వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. ఆర్టీసీ అధికారులు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..