AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్.. రాబోయే 3 రోజులపాటు వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలో

ఈశాన్య రుతుపవనాల సీజన్‌ ప్రారంభమైంది. మరోవైపు బంగాళాఖాతంలో తుఫాను సర్క్యులేషన్ ఏర్పడింది. దీంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి.

AP Weather: రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్.. రాబోయే 3 రోజులపాటు వర్షాలు..  ముఖ్యంగా ఆ జిల్లాలో
AP Weather Alert
Ram Naramaneni
|

Updated on: Oct 31, 2022 | 5:42 PM

Share

ఆదివారం నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం… సోమవారంకు నైరుతి బంగాళాఖాతం, ఉత్తర శ్రీలంక తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంది. అంతేగాక ఆంధ్రప్రదేశ్,  యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. అంతేకాకుంగా బంగాళాఖాతంలోని నైరుతి ప్రాంతాలపై మరొక తుఫాను సర్క్యులేషన్ ఏర్పడింది.  దీంతో వచ్చే 3 రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ప్రత్యేకించి, సోమవారం నుంచి బుధవారం (అక్టోబర్ 31 నుండి నవంబర్ 2 వరకు) యానాంతో పాటు రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.  బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-

………………………………………………………………………………………….

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :——–

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా చోట్ల కురిసే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :———–

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ :————

ఈరోజు:- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

రేపు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

Follow Us
బంగార ధలు ఒక్కసారిగా ఢమాల్.. గురువారం ధరలు ఇవే..
బంగార ధలు ఒక్కసారిగా ఢమాల్.. గురువారం ధరలు ఇవే..
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
శ్రీదేవి ఆస్తుల వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
వీరి జీవితాన్ని మార్చడానికి కలిసి రాబోతున్న భారీ గ్రహాలు
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులకు కూడా యూపీఐ ఛార్జీలు పడతాయా?
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
రూ.1.7 లక్షల పెట్టుబడితో నాటుకోళ్ల పెంపకం.. రూ. 10 లక్షల లాభం..!
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
ట్రైలర్ లేకుండానే రిలీజైన తెలుగు సినిమాలివే.. రిజల్ట్స్ ఏంటంటే?
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
RRB రైల్వేలో పారా మెడికల్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
టీమిండియాలోకి తొలిసారి ఎంట్రీ ఇస్తున్న బారాముల్లా ఎక్స్‌ప్రెస్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం