Rains in Kadapa, Nellore: మళ్ళీ నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

|

Nov 28, 2021 | 3:40 PM

Rains in Kadapa, Nellore: ఇటీవల రాయలసీమ జిల్లాల్లోని కడప, అనంతరపురం, చిత్తూరులతో పాటు నెల్లూరులో కూడా భారీ వర్షాలు కురిశారు. వరదలు బీభత్సం సృష్టించాయి. ఇంకా వర్షాలు, వరదల..

Rains in Kadapa, Nellore: మళ్ళీ నెల్లూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
Nellore Kadapa Rains
Follow us on

Rains in Kadapa, Nellore: ఇటీవల రాయలసీమ జిల్లాల్లోని కడప, అనంతరపురం, చిత్తూరులతో పాటు నెల్లూరులో కూడా భారీ వర్షాలు కురిశారు. వరదలు బీభత్సం సృష్టించాయి. ఇంకా వర్షాలు, వరదల నుంచి ప్రజలు కోలుకోక ముందే.. మళ్ళీ కడప, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

అల్పపీడన ద్రోణి ప్రభావంతో నెల్లూరు, కడప జిలాల్లతో పాటు.. ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో.. ప్రజలు కలవరపాటుకు గురవుతున్నారు. కడపలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నదులు వాగులు వంకలు పొంగి పొర్లు తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి.రోడ్లు నదులను తలపిస్తున్నాయి. చిట్వేలి, రాపూర్ మధ్య రాకపోకలను నిలిపివేశారు.

మరోవైపు నెల్లూరు లో కూడా  వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వేంకటగిరి, డక్కలి, రాపూరు, పొదలకూరు, ఆత్మకూరు, సంగం, మర్రిపాడు, చెజర్ల, అనంతసాగరం, ఏయస్ పేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అత్యధికంగా ఆత్మకూరులో 10. సెం. టి మీటర్ల వర్షపాతనం నమోదయ్యాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.రాపూరు పట్టణంలో పశువైద్య శాలలో నీరు చేరడంతో ఆస్పత్రిలోని సామాగ్రి నీట మునిగింది. ఇప్పటికే పెద్ద చెరువు, దాబాల చెరువు, ఎర్ర చెరువు నిండుకులను తలపిస్తున్నాయి. గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలు నరు మల్లు వేసిన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కట్టలు తెగిపోయి నారుమళ్లు కొట్టుకుపోయాయి.  అనంతసాగరం ఎస్సీ కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అధికారులు వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు..డిమాండ్‌ చేశారు.

అనంతరపురం జిల్లాలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా కంభం, బెస్తవారి పేట, అర్ధవీడు మండలంలో వర్షాలు పడుతున్నాయి.  అయితే రాష్ట్రానికి మరో అల్పపీడనం సూచనతో అధికారులు, ప్రభుత్వం అప్రమత్తయింది. ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

Also Read:  మందుబాబులకు ఆగ్రహం తెప్పించిన కుదురులేని కుక్క.. ఫన్నీ వీడియో వైరల్..