
ఒక ద్రోణి, ఉత్తర గుజరాత్, దానిని ఆనుకుని ఉన్న నైరుతి రాజస్థాన్ మీదుగల వాయుగుండం తో అనుబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి మధ్యప్రదేశ్ మీదుగా ఛత్తీస్‌గఢ్ వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 & 7.6 కి.మీ మధ్య ఎత్తులో ఉంది. ఎత్తుకు వెళ్ళేకొలది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతములో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ మధ్య ఎత్తులో కొనసాగుతోంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
——————————————
ఆదివారం : – తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. మరి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
సోమవారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-
——————————————
ఆదివారం, సోమవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
——————————————
ఆదివారం, సోమవారం, మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
బలమైన గాలులు గంటకు 30 -40 కి.మీ. వేగం తో వీచే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..