Congress Tickets: ఏపీ కాంగ్రెస్‌లో నయా జోష్‌.. పోటీ చేసేందుకు క్యూ కడుతున్న నేతలు.. కారణం అదేనా..!

|

Feb 10, 2024 | 8:40 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో నయా జోష్‌ కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ గిరాకీ. సీట్లు ఓట్ల సంగతి ఎలా వున్నా అప్లికేషన్లు వెయ్యి మార్క్‌ చేరువయ్యాయి. ఆశావహుల సంఖ్య పెరగడంతో దరఖాస్తు గడువును ఫిబ్రవరి 29 వరకు గడువును పెంచింది ఏపీ కాంగ్రెస్‌.

Congress Tickets: ఏపీ కాంగ్రెస్‌లో నయా జోష్‌.. పోటీ చేసేందుకు క్యూ కడుతున్న నేతలు.. కారణం అదేనా..!
Ap Congress
Follow us on

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో నయా జోష్‌ కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ పార్టీలో టికెట్‌ గిరాకీ. సీట్లు ఓట్ల సంగతి ఎలా వున్నా అప్లికేషన్లు వెయ్యి మార్క్‌ చేరువయ్యాయి. ఆశావహుల సంఖ్య పెరగడంతో దరఖాస్తు గడువును ఫిబ్రవరి 29 వరకు గడువును పెంచింది ఏపీ కాంగ్రెస్‌.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ముఖచిత్రంలో కాంగ్రెస్‌ అనే పార్టీ అసలు వుందా? లేదా? అన్నట్టుగా ఉండే ఇన్నాళ్లు పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లో నయా జోష్‌ కనిపిస్తోంది. మేమూ ఉన్నామూ రేస్‌లో అని పదేళ్ల తర్వాత చెయ్యేత్తి చెప్పే స్తున్నారు ఏపీ కాంగీయులు. గత రెండు పర్యాయాలు ఎన్నికల ప్రచార సామాగ్రి తీసుకెళ్లడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు సీన్‌ ఛేంజ్‌. మిగతా పార్టీల్లా కాంగ్రెస్‌ తోటలోనూ టికెట్ల కోసం పోటీ ఊటలా పెరుగుతోంది.. అవును, ఏపీలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసేందుకు నేతలు క్యూ కడుతున్నారు.. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కోసం పెద్దఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు ఆశావహులు. ఊహించనిదానికంటే ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిపడుతున్నాయ్‌.

ఇప్పటివరకు దాదాపు 9వందల అప్లికేషన్లు వచ్చాయ్‌. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 793మంది… 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు 105మంది అప్లయ్ చేసుకున్నారు. ఇంకా దరఖాస్తులు వెల్లువలా వస్తూనే ఉన్నాయ్‌. చెయ్యి గుర్తుపై పోటీ చేయాలనే ఉత్సాహంతో దరఖాస్తుల కౌంట్‌ …వెయ్యి మార్క్‌ను టచ్‌ చేసిందట. టికెట్‌ కావాలా నాయనా… అని రిక్వెస్ట్‌ చేయాల్సిన అవసరం లేకుండా అప్లికేషన్‌లు రావడంతో చాన్నాళ్ల తరువాత ఒకింత కళ వచ్చింది. ఇది ఎవరికి కలవరమో ? ఎవరి కల…వరమో ! ఏదైతేనేమ్‌… ఆశావహుల సంఖ్య పెరగడంతో దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగించింది ఏపీ కాంగ్రెస్‌.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…