AP Rains: అబ్బబ్బా.! ఎంతటి కూల్ న్యూస్ అండీ.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

ఏపీలో విచిత్ర వాతావరణం నెలకొంది. ఒక పక్క సూర్యుడు భగభగలు చూపిస్తుంటే.. మరోపక్క కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరి తాజాగా వాతావరణ శాఖ ఇచ్చిన కీలక సూచనలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓ లుక్కేయండి.

AP Rains: అబ్బబ్బా.! ఎంతటి కూల్ న్యూస్ అండీ.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
Ap Rains

Updated on: Mar 12, 2025 | 4:59 PM

తూర్పు గాలుల ద్రోణి బుధవారం పశ్చిమ భూమధ్య రేఖ హిందూ మహాసముద్రం, పరిసర ప్రాంతం మాల్దీవులపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీర ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నది. దిగువ ట్రోపోఆవరణంలో కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, రాయలసీమలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————-

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

బుధ, గురు, శుక్రవారాల్లో:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

బుధ, గురు, శుక్రవారాల్లో:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

రాయలసీమ:-

బుధవారం:- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదు.

గురు, శుక్రవారాల్లో:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.