Chandrababu Cases: క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో అమీతుమీ.. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన 17A సెక్షన్

రాజకీయ ప్రతీకార చర్యగానే చంద్రబాబును అరెస్ట్‌ చేశారంటూ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. FIR నమోదైన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని.. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2019లో ఓ కేసు కొట్టేశారని గుర్తు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు లేదన్నారు సాల్వే. దర్యాప్తు అనేది పోలీసుల బాధ్యత మాత్రమే.. అన్ని రకాల విధుల్లో 17Aతో రక్షణ ఉంటుందన్నది చంద్రబాబు తరపున సాల్వే వినిపించిన వాదనలు.

Chandrababu Cases: క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో అమీతుమీ.. దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన 17A సెక్షన్
Chandrababu Cases

Updated on: Oct 13, 2023 | 9:06 AM

17A చంద్రబాబుకు తప్పకుండా వర్తిస్తుంది.. చట్టం దుర్వినియోగం కావొద్దనే 17Aను తీసుకొచ్చారు. రాజకీయ ప్రతీకార చర్యగానే చంద్రబాబును అరెస్ట్‌ చేశారంటూ హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. FIR నమోదైన తేదీని పరిగణనలోకి తీసుకోవాలని.. చట్ట సవరణకు ముందున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని 2019లో ఓ కేసు కొట్టేశారని గుర్తు చేశారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం పోలీసులకు దర్యాప్తు జరిపే హక్కు లేదన్నారు సాల్వే. దర్యాప్తు అనేది పోలీసుల బాధ్యత మాత్రమే.. అన్ని రకాల విధుల్లో 17Aతో రక్షణ ఉంటుందన్నది చంద్రబాబు తరపున సాల్వే వినిపించిన వాదనలు.

సాల్వే వాదనలకు కౌంటర్‌గా సీఐడీ తరపున న్యాయవాది రోహిత్గీ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. 17A ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుకు వర్తించదన్నారు. అవినీతికి పాల్పడేవారికి 17A అండగా ఉండొద్దని.. అసలీ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా చూడొద్దన్నారు. 2018కి ముందు కొంత వరకు విచారణ జరిగిందని.. ఆధారాలు దొరికిన తర్వాత 2021లో కేసు నమోదు చేశారన్నారు. చంద్రబాబును ఎప్పుడు FIRలో చేర్చినా.. విచారణ కొనసాగుతున్నట్టుగానే పరిగణించాలని వాదనలు వినిపించారు రోహత్గీ.

17Aపై ఇప్పటికే 3 సార్లు బెంచ్ ముందు పోటాపోటీ వాదనలు కొనసాగాయి. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది. తీర్పు ఎలా వచ్చినా ఇదోక బెంచ్‌ మార్క్‌గా నిలిచిపోయే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు.

బెయిల్ పిటిషన్‌పై తీర్పును

అంగళ్లు హత్యాయత్నం కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే వేల కోట్ల స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో లోకేష్ పేరును ఇంకా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని ఏపీ సీఐడీ కోర్టుకు తెలియజేయడంతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో నారా లోకేష్‌కు హైకోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. అంగల్లు ఘటనలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు వెలువరిస్తామని ప్రకటించింది.

అంగళ్లు కేసులో నిందితులుగా పేర్కొన్న వారిలో కొందరికి ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించిందని నాయుడు తరపు న్యాయవాది నొక్కి చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ తర్వాతే హింస ప్రారంభమైందని సిఐడి తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించారు.

ఆ రోజున ఏం జరిగిందంటే..

అన్నమయ జిల్లా అంగళ్లు గ్రామంలో ఆగస్టు 4న జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర టీడీపీ నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. చంద్రబాబు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరిగిన హింసాత్మక ఘటనతో పాటు అంగల్లులో కూడా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పోలీసులు  పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి