Andhra News: రెండేళ్లలో 29 మిస్టరీ మరణాలు.. ఇంతకు ఆ గ్రామంలో ఏం జరుగుతుంది!
సాధారణంగా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదమో, లేదా వయస్సు మీద పడితేనో మరణం సంభవిస్తుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం కారణాలు తెలియకుండా జనాలు చనిపోతున్నారు. ఇలా దాదాపు 2 సంవత్సరాల్లో 29 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇంతకు వాళ్లు ఎలా చనిపోయారు. ఆ గ్రామం ఏదో ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదమో, లేదా వయస్సు మీద పడితేనో మరణం సంభవిస్తుంది. కానీ ఆ గ్రామంలో మాత్రం కారణాలు తెలియకుండా జనాలు చనిపోతున్నారు. ఏ అనారోగ్యాలు లేనివాళ్లు, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తురకపాలెంలో రెండు సంవత్సరాల్లో 20 మందికిపైగా జనాలు ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగమంతా వెంటనే ఆ ఊరికి చేరుకుంది. ఆ గ్రామంలో మరణాలకు గల కారణాలు తెలుసుకోవడంపై దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగానే గ్రామంలో 18 ఏళ్ల పైబడిన వారందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్‌ని గుంటూరు, తెనాలి, విజయవాడ ఆసుపత్రులకు పంపుతున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో యాభై వైద్య బృందాలు తురకపాలెంలో పనిచేస్తున్నాయి. రెండ్రోజుల్లో నలుగురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.
తాగునీరు కలుషితం కావడమే ఈ మరణాలకు కారణమని తురకపాలెం ప్రజలు అనుమానిస్తున్నారు. అందుకే అధికారులు బయటినుంచి ఆహారాన్ని, తాగునీటిని తీసుకొచ్చి గ్రామంలో అందరికీ పంపిణీ చేస్తున్నారు. 2500 మంది జనాభా ఉన్న తురకపాలెం గ్రామంలో తొమ్మది ఫుడ్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




